తూటాను మోస్తున్నవాడి ప్రశ్న


Sun,April 6, 2014 12:21 AM

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అడవుల్ల/పదిమందినీ కాల్చి/ ప్రత్యేక తెలంగాణకు నాకూనల్లార/ పండుగ కానుకన్నారో నా కూనల్లారా.. అన్న ఈ పాట తెలంగాణ కోసం రాసిన పాట. తెలంగాణ ఉద్యమానికి పీపుల్స్‌వార్ మద్దతు ప్రకటించినాక జరిగిన మానాల ఎన్‌కౌంటరు. పాలకులు ఈ ఉద్యమానికి వార్ మద్దతిస్తే ఏమి జరుగుతుందో? ఊహించిన వాళ్లు కనుకనే పండుగ కానుకగా ఎన్‌కౌంటర్‌ను ఇచ్చినారని భవిష్యత్ చిత్రపటాన్ని పదాల నిండా పొదిగిండు గద్దర్. మావో డ్రాగన్‌తో మాట్లాడినట్టుగానే గద్దర్ శివునితో శివరాత్రితో మాట్లాడిం డు. ఇది పురాసంస్కతీ స్వీకరణ నుంచి వర్తమానం మాట్లాడడం వంటిదే. అప్పటికే గద్దర్ తెలంగాణకు పునరంకితమయిండు. సరిగ్గా ఇవ్వాల్టికి పదిహేడు సంవత్సరాల క్రిందట ఆయన మీద బుల్లెట్లు కురిసినయ్. ననుగన్న తల్లులార/తెలుగుతల్లి బిడ్డలార/ మీ పాటనై వస్తున్నానమ్మో/నా బిడ్డలార అని ప్రకటించిన గద్దర్ వెన్నెముకల ఉన్న తూటమ్మో/ అన్నా పద పాడుదమందో అని ప్రకటించుకున్నడు. పదిహేడు సంవత్సరాలుగా ఆయన శరీరంలో భాగమైన తూటా ఆనవాళ్లు ఎక్స్‌రే పరీక్షల్లో తేలుతున్నాయి కానీ, ఆ తూటా పేల్చిన వాడెవడో? రాజ్యం కనిపెట్టలేకపోయింది. ఇప్పటికీ అజాపజాలేని శత్రువు పేల్చిన తూటా శరీరంలో తిరగాడుతుండగా, గాయపడి, కలుక్కుమంటున్న మనసుతో ఒకే ప్రశ్న అడుగుతున్నడు. తెలంగాణ తెచ్చుకునే పోరాటంలో దిగిన తూటా రహస్యం తెలంగాణ వచ్చినాకనన్నా బయటపడ్తుందా! శరీరంలో ఒక ఆనవాలు మిగిలింది. ఇది నరహంతక పాలనకు కొండ గుర్తు. ఈ ఆనవాలు సాక్ష్యంగా... కడుపులోంచి తన్నుకొచ్చే ఉక్రోశ, ఆక్రోశ, ఆవేదనల నుంచి ఏలికలారా! భవిష్యత్ పాలకులారా! ఒక ప్రశ్నడుగుతాను చెప్పుతరా! అని అడుగుతున్నడు గద్దర్. పదిహేడేళ్ల తర్వాత. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, అన్ని రకాల చట్టపర కార్యకలాపాల మీదా నమ్మకం ఉంచి కొట్లాడిన తర్వాత ఈ ప్రజాస్వామ్యపు పొడిగింపు సంగతులు ఎవరైనా మాట్లాడగలరా! అని అడుగుతున్నడు గద్దర్.

గద్దర్ మీద బుల్లెట్లు కురిసినయ్. బెల్లి లలిత ముక్కలయింది. కనకాచారి, పురుషోత్తంలు నెత్తుటి మడుగుల్లో మత్యువు పాలయిండ్రు. మానాల ఎన్‌కౌంటర్‌లో అవయవాలు ఛిద్రమైన బీభత్స దశ్యాలు తెలంగాణ వర్తమాన రాజ్యహింసకు పరాకాష్ట అయినవి. నల్లా వసంత్, సుదర్శన్‌లు ఎన్‌కౌంటరయ్యారు. ఆట బంద్. పాట బంద్. మాట బంద్. తెలంగాణ ఉద్యమం తనకు తాను విశాలం చేసుకున్నది. తనను తాను ప్రజాస్వామ్యీకరించుకున్నది. ప్రజాస్వామ్య డిమాండ్ కోసం ప్రజాస్వామ్య రూపాల పోరాటం చేసింది. టీఆర్‌ఎస్ పుట్టుక తెలంగాణ రాజకీయాలలో పరిమిత ప్రజాస్వామ్య స్వేచ్ఛలకు ఒక రూపం అయ్యింది. కానీ ఈ మొత్తం క్రమంలో ప్రజాస్వామ్య రూపాల పరిణతి ఎట్లా ఉంటుందో? వాటిని ఎట్లా ఆచరించాలో చూపింది గద్దర్.గొంగడి, గోసి, జీవితాంతం మోసే కట్టెకు తొడిగిన విరబూసిన ఎర్రజెండా పట్టుకుని తెలంగాణ ఈ మూల నుంచి ఆ మూల దాకా శాంతియాత్ర చేసిండు గద్దర్. ఒక విప్లవయోధుని శాంతి యాత్ర. ఒక యుద్ధనౌక శాంతియాత్ర. బొగ్గుబావుల మీద ఎగసిన నిప్పు కణికల్లో గద్దర్ తెలంగాణ ఊపిరులూదాడు. వెన్నులో తూటా దించినవాళ్లూ సిగ్గుపడేట్టుగా అంతా ప్రశాంతంగా... అంతా ఒకే ఊరేగింపుగా... అంతా ఎగసిన ఒక అచ్చ తెలంగాణ కెరటంలాగ గద్దర్ తెలంగాణను కాలినడకన చుట్టివచ్చాడు. ఊర్లు కదిలినయ్... పల్లెలు పబ్బతి పట్టినయి. పట్నాలు మేల్కాంచినయ్... మళ్లీ పున్నమి వెన్నెలలు రాత్రుళ్లు గద్దర్ పాటతో పునీతమై ఆకాశాల నిండా పాకినయ్. ఏళ్ల తర్వాత ఊళ్లకు ఊళ్లు పాట వెంట ప్రవాహమై పరుగులు పెట్టినయ్. వెంట అన్ని పార్టీలు. వెంట అన్ని రకాల తెలంగాణవాదులు. వెంట అన్ని రకాల సమూహాలు. నినాదం ఒక్కటే తెలంగాణ. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పోరాటం జరగాలె. రాజకీయ ప్రక్రియ ఢిల్లీ పార్లమెంటులో బిల్లుతోనే తెలంగాణ. తుపాకులు లెవ్వు. తుపాకులకు మించిన తెలంగాణ అస్తిత్వ పునాదులు బలంగా ఉన్నవి. గుండెల నిండా ఉప్పొంగే అయిదు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ వారసత్వమూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికే పరీక్ష. ఒక ప్రజాస్వామ్య డిమాండ్ కోసం ప్రజాస్వామ్య పోరాటం.

గద్దర్‌ను ఎప్పుడైనా పరీక్షగా చూసినారా! నలభై సంవత్సరాల నిలువు ఉద్యమం గద్దర్. పడినవాడు. కెరటమై లేచినవాడు. అగాధాలు, అగడ్తలు దాటినవాడు. ఆకాశం అంచులను ముద్దాడినవాడు. పాట అతని ఆయుధం. ఎర్రజెండా గద్దర్ బలహీనత. కాదు కాదు ప్రాణం. అది అతని జీవితంలో అతుక్కుపోయిన ఒక అవయవం. విడదీయలేని ఆత్మ. అంతరాత్మ. పదిహేడేళ్లుగా శరీరంలో దాక్కున్న తూటా లాగే ఎర్రజెండా అతని వెంట నడిచే ఒక గేయం. ఒక గాయం. అతను నవ్వితే ఎర్రపూలు పూస్తాయి. అతను శోకిస్తే ఎర్రపూలు దుఃఖిస్తాయి. వీరులారా... వీరులారా/రాడికల్ల శూరులారా/ మీరు కాకమ్మలయ్యి వస్తారా నా బిడ్డలు అని అమరుల పాదాపాదాన పరిపరి దండాలు పెట్టే గద్దర్ పాట ఎత్తు పల్లాలు చూసింది కానీ... నిబద్ధత వీడలేదు. అభినివేశం కొదువలేదు. అది విప్లవ పోరాటంతో మమేకమై పెన్నూ, గన్ను పట్టినా.. అది కామోఫ్లెజ్ ఖడక్‌డ్రెస్ ధరించి ఆగదు ఆగదు ఆగదు/ ఈ సాయుధ పోరు ఆగదు అని సైనిక కవాతు చేసినా, చట్టబద్ధ, ప్రజాస్వామ్య తెలంగాణ పోరాటంలో శాంతియాత్ర చేసినా గద్దర్ గొంతు దారి తప్పలేదు. పొలమారలేదు. నాలుగు దశాబ్దాలుగా అది ప్రజల కోసం పాడింది. అది కడుహీనపు బతుకుల కోసం పాడింది. అన్నార్తుల కోసం పాడింది. అమరుల కోసం పాడింది. సామ్రాజ్యవాదం విషపు తెరలు వ్యాపించిన కలర్ టీవీల విషపు నాగుల సంస్కతిని నిరసించింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న, మానవ సంబంధాలను తుంచేస్తున్న, మనిషిని మాయం చేస్తున్న సామ్రాజ్యవాద సంస్కతిని తెరలమీద పసిగట్టి పాడింది. శత్రువు మర్నాగియై, మార్మిక రూపమై ఆక్రమించుకుంటున్న తీరును కత్తిదూసి ఖండఖండాలుగా నరికింది. నిద్రపోతున్న వాడిని మేల్కాంచింది గద్దర్ పాట. సహస్ర వత్తుల సమస్త చిహ్నాలను గానం చేసిండు గద్దర్. ఎంతా సక్కాగున్నాదో నా చెత్తకుండీ/ అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండీ అని అట్టడుగున ఏడ కాన్పించని వస్తు సంపదకి, శ్రమ సౌందర్యాన్ని, చెమట చుక్కల సొబగులను పాడిండు గద్దర్. ఇవ్వాళ్ల దేశమంతా తుడిచేస్తున్న ఆప్ చీపురుకట్టను కైగట్టినవాడూ గద్దరే. ఊడ్చేసే ఉప్పెనలను కలగన్న పాట గద్దర్‌ది. అతనివ్వాళ్ల ఒక ప్రజాస్వామ్య, శాంతియాత్ర చేసిన ప్రజాస్వామ్యవాదిలా భవిష్యత్ తెలంగాణలో ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నా శరీరంలో దిగిన తూటా ఎవడిది? దించినవాడెవడు? ప్రజాస్వామ్యం మీద పేలిన ఈ తూటా జాడలు ఎక్కడివి. అవి నీడలుగా విస్తరిస్తాయా? తెలంగాణ రేపటి నవ తెలంగాణ ఎలా ఉండబోతున్నది. నిజమే ఇదొక ప్రశ్న. కీలకమయిన ప్రశ్న.

సీమాంధ్ర పెట్టుబడి ఉద్యమం జరిగినప్పుడు కానీ తెలంగాణకు ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటుందో? అది ఉద్యమాలను ఎట్లా చేయిస్తుందో? అర్థమే కాలేదు. తెలంగాణ ఉద్యమం పొడవునా నిర్బంధాలు, చిత్రహింసలు, బారికేడ్లు, ముళ్లకంచెలు, కేసులు, జైళ్లు, లాఠీచార్జీలు, రబ్బరు బుల్లెట్లు, ఆంక్షలు, అప్రకటిత నిషేధాలు, కదలనివ్వని, మెదలనివ్వని, ఊపిరి సలపనివ్వని, చివరికి కేసీఆర్‌ను, ఒక మాజీ కేంద్రమంత్రిని కూడా గ్రేహౌండ్స్‌తో ఎత్తివేయించి దౌర్జన్యంగా, దారుణం గా జైలులో మానసిక హింసలు పెట్టిన సీమాంధ్ర పాలకులు ప్రజాస్వామ్యమంటే ఏమిటో? సీమాంధ్ర లో చూపారు. నిత్య అణిచివేతల్లో ధ్వంసమయింది తెలంగాణ. ఆ అణచివేతల నుంచి రాటు దేలిందే తెలంగాణ ప్రజాస్వా మ్య పోరాటం. అది చివరకు విజయం సాధించింది. అది ఉప్పెనై కేంద్ర ప్రభుత్వాలను మొసమర్రకుండా చేసింది.చరిత్రకు పాఠా లు నేర్పింది. గద్దర్ ఒక్కరేకాదు. ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన మొత్తం తెలంగాణలో ప్రజాస్వా మ్య స్ఫూర్తి కొనసాగుతుందా? పౌరస్వేచ్ఛలు వర్ధిల్లుతాయా? మానవ హక్కులకు గౌరవం దక్కుతుందా? పాటిస్తారా! ప్రతి మనిషికీ రాజ్యాం గం ధారాదత్తం చేసిన, కల్పించిన రాజకీయ అభిప్రాయాల ప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛలు వర్ధిల్లుతాయా? తెలంగాణ ఉద్యమం పొడవునా కొనసాగిన రెండుశ్రేణులు సామాజిక తెలంగాణ శ్రేణు లు, ప్రజాస్వామ్య తెలంగాణ శ్రేణులు ఈ ప్రశ్న అడుగుతున్నాయి. పదిహేడే ళ్ల తర్వాత గద్దర్ ఇదే ప్రశ్నకు జవాబు కోరుతున్నారు. ఇప్పుడాయన ఒక పాట రాస్తున్నాడు. తల్లి గురించి, సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మ గురించి.. తెలంగాణ వచ్చినంక . లచ్చుమమ్మకు ఏమి వచ్చిందో? రాలేదో? కడగడానికి, అడగడానికి. గద్దర్ ఆయుధం పాటే. ఒకటి నిజం..అది తుపాకికన్నా ప్రమాదకరమైనది. ఒక్కటి మాత్రం నిజం..బుల్లెట్‌ను శరీరంలో దాచుకుని బతికేవాడి ప్రశ్న తూటాకన్నా సూటిగా ఉంటుంది.
narayana.allam@gmail.com

939

Allam Narayana

Published: Sat,March 8, 2014 01:02 AM

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బ

Published: Tue,March 4, 2014 04:10 AM

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడద

Published: Sat,March 1, 2014 12:30 AM

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రం

Published: Fri,February 28, 2014 12:31 AM

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వార

Published: Wed,February 26, 2014 03:03 AM

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట

Published: Tue,February 25, 2014 12:57 AM

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యల

Published: Sat,February 22, 2014 01:24 AM

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద

Published: Fri,February 21, 2014 01:10 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Fri,February 21, 2014 01:09 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Sat,February 15, 2014 01:08 AM

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిర

Published: Fri,February 14, 2014 12:44 AM

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌స

Published: Tue,February 11, 2014 12:13 AM

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవ

Published: Sat,February 8, 2014 02:29 AM

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇ

Published: Fri,February 7, 2014 01:08 AM

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకా

Published: Fri,January 31, 2014 12:31 AM

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలం

Published: Thu,January 30, 2014 12:33 AM

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగ

Published: Wed,January 29, 2014 02:24 AM

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎ

Published: Tue,January 28, 2014 02:24 AM

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్

Published: Mon,January 27, 2014 12:43 AM

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్

Published: Sat,January 25, 2014 12:56 AM

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెల

Published: Fri,January 24, 2014 12:09 AM

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు.

Published: Wed,January 22, 2014 12:36 AM

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్

Published: Sat,January 11, 2014 02:36 AM

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిల

Published: Wed,January 8, 2014 12:47 AM

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా

Published: Fri,January 3, 2014 01:19 AM

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బా

Published: Thu,January 2, 2014 01:17 AM

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆప

Published: Wed,January 1, 2014 01:03 AM

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆం

Published: Sat,December 28, 2013 12:44 AM

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానాని

Published: Sun,October 6, 2013 01:58 AM

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీ

Published: Sun,August 11, 2013 12:20 AM

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలు

Published: Sun,May 12, 2013 12:08 AM

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధ

Published: Sun,May 27, 2012 12:11 AM

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్

Published: Wed,March 14, 2012 12:40 AM

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్

Published: Sun,March 4, 2012 12:15 AM

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో

Published: Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామ

Published: Sat,January 7, 2012 11:49 PM

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు

Published: Sat,December 31, 2011 11:33 PM

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్

Published: Sun,December 4, 2011 12:33 AM

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గ

Published: Sun,November 20, 2011 12:37 AM

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇ

Published: Sun,October 23, 2011 12:51 AM

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లక

Published: Sat,September 24, 2011 10:32 PM

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూని

Published: Sun,September 11, 2011 12:02 AM

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల

Published: Mon,July 25, 2011 12:10 PM

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాట