నీచ రాజకీయం!


Wed,February 26, 2014 03:03 AM

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ఆయుధం. ప్రజాస్వామ్యానికి ప్రాణం.

వర్తమాన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో, రాజకీయపార్టీలు ప్రజల గురించి ఎంత నీచంగా ఆలోచిస్తున్నాయో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత జగన్ బాబు మాటలను బట్టి తెలుస్తున్నది. ఈ ఇరువురు నాయకులు ఇంకా తెలంగాణపై ఆశలు పెట్టుకున్నారు. తమ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంద ని, విజయావకాశాలు ఉన్నాయని చంద్రబాబు అంటున్నాడు. జగన్ కూడా ఇదే అంటున్నాడు. వీరి నోటి నుంచి ఈ మాటలు ఎట్లా వచ్చాయి? ఇంగితం ఉన్న ఏ మనిషి కూడా మాట్లాడని రీతిలో దిగజారి పోయి ఈ నాయకులు ఎట్లా మాట్లాడ గలుగుతున్నారు?
తెలంగాణ ఏర్పడుతున్నదని తెలిసి తనకు ఆరు నెలలుగా నిద్రపట్టలేదని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు. 2009లో ప్రకటన వెలువడినప్పుడే అడ్డంపడిన ఘనత ఆయనది. ఇటీవల దేశమంతా తిరిగి అనేక మంది నాయకులను కలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘనుడు.

అతడు బీజేపీతో జత కట్టిందే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి. ఈయన ఇప్పుడు తెలంగాణలో విజయోత్సవాలు జరుపుకోవాలని పార్టీ క్యాడర్‌కు సూచిస్తున్నాడు. తెలంగాణ పునర్నిర్మాణం చంద్రబాబుతోనే అవుతుందట. ప్రజలు టీడీపీకే విజ యం కట్టబెడతారట. టీడీపీ గెలుపు చరిత్రాత్మక అవసరమట. బుల్లెట్లా దూసుకెళతాం... అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం అని సవాలు చేస్తున్నాడు. ఎంత ధీమా! ప్రజలు అజ్ఞానులని ఎంత నమ్మకం! ఇగ జగన్ రెడ్డి మాటలు చంద్రబాబు మాటలకేం తీసిపోయేవిగా లేవు. తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనేది ముగిసిన అధ్యాయమట! తమ పార్టీకి దాదాపుగా అన్ని జిల్లాల్లో అనుకూల పరిస్థితి ఉన్నదట. గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తడట.

ఖమ్మంలో సభ పెడ్తడట. తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేస్తున్నా సరే చలించక, చంద్రబాబుతో పోటీ పడి దేశమంతా తిరిగి కుట్రలు చేసిన జగన్ ఇప్పుడు నల్లగొండలో ఓదార్పు యాత్ర చేస్తడట! తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో తమ ఎంపీలతో నానా రభస చేయించిన ఈ సీమాంధ్ర పెత్తందారులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత ఉన్నదా? తెలంగాణ సమాజం తన అస్తిత్వం కోసం ఎంత పోరాడింది! ఎన్ని త్యాగాలు చేసింది. ఎంత మంది బలిదానాలు చేశారు! సీమాంధ్ర నాయకులకు, వారి తాబేదార్లకు తెలంగాణలో పత్తా లేకుండా చేసిన గొప్పతనం తెలంగాణ ఉద్యమానిది. ఒక మానుకోట, ఒక పాలకుర్తి తెలంగాణ చైతన్యానికి నిదర్శనం. ఇంత జరిగిన తరువాత కూడా ఈ సీమాంధ్ర పెత్తందారులు ఇంకా తెలంగాణలో తమకు ఉనికి ఉన్నదని భ్రమపడడం వింత కాదా!

రాజకీయాలు ఎంతగా దిగజారాయీ అంటే- ఇప్పుడు ప్రజాసేవ ద్వారా ఎన్నికలలో గెలవడం అనేది అర్థం లేనిదిగా మారిపోయింది. రాజకీయం అంటే డబ్బు సంచులు కుమ్మరించే వారు ప్రత్యక్షం గా, పరోక్షంగా చెలాయించే అధికారం. వీరి ఆజమాయిషీలో మాఫియా ఉంటుంది. వీరి దష్టిలో ఎన్నికలు అంటే డబ్బులు పంచడం. ఈ హీన కార్యాన్ని నిర్వర్తించే యంత్రాంగమే పార్టీ క్యాడర్. ప్రజలు అంటే వీరి దష్టిలో డబ్బులు తీసుకుని ఓట్లేసే కిరాయి మనుషులు. అధికారంలో ఉండి కోట్లు దండుకోవచ్చు. ఎన్నికల తరువాత అన్ని పార్టీల వారు లాలూచీ పడడం, సిండికేట్లుగా ఏర్పడడం, వనరులను ఏ దేశీయ, విదేశీ కంపెనీకో కట్టబెట్టి దళారీ పాత్ర నిర్వహించడం- ఇవీ వర్తమాన రాజకీయాలంటే. ఈ రాజకీయాలను విలువలు కాదు, కాసులు శాసిస్తాయి. ఈ సంస్కతిలో పుట్టి పెరిగిన వారు, ఇందులోనే ఆరితేరి నాయక పాత్ర పోషిస్తున్న వారు తెలంగాణ రాజకీయాలను కూడా అదే విధంగా చూస్తారు. రాజకీయాలను మరో విధంగా అర్థం చేసుకోవడం వీరికి సాధ్యం కాదు. అందుకే ఇంత పెద్ద ఉద్య మం సాగిన తరువాత కూడా ఇంకా తెలంగాణ రాజకీయాలను శాసిస్తామని చంద్రబాబు, జగన్‌బాబు ధీమాగా చెబుతున్నారు. తమకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పుతున్నారు. విజయం సంగతెట్లా ఉన్నా, తెలంగాణలో తమ పార్టీలకు మనుగడ ఉన్నదని మాత్రం నమ్ముతున్నారు.

కానీ తెలంగాణ ఉద్యమం రాజకీయాలను పూర్తిగా మార్చిపారేసింది. రాజకీయాలను పునర్నిర్వచించింది. రాజకీయాలను ఉన్నతీకరించింది. రాజకీయాలలో విలువలను ప్రవేశ పెట్టింది. కాళోజీ ఆకాంక్షించినట్టు రాజకీయాన్ని ప్రజాకీయంగా మార్చింది. బాధ్యత లేని నాయకులు పల్లెల్లో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితులను సష్టించింది. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే రాజకీయాలు ఎంతగా మారిపోయా యో, ప్రజలు ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో తెలుస్తున్నది. ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక గుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ఆయుధం. ప్రజాస్వామ్యానికి ప్రాణం. అదొక రాజకీయ ఆకాంక్ష. ఇది తెలంగాణ ఉద్యమం సాధించిన విజయం.

530

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

country oven

Featured Articles