పతనం...


Sat,February 15, 2014 01:08 AM

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం.

సీమాంధ్ర బేహారిగా ఉండి ప్రజానాయకుడి అవతారం ఎత్తి పార్లమెంటులో ప్రవేశించిన లగడపాటి రాజగోపాల్ గురువారం పార్లమెంటులో వ్యవహరించిన తీరు దేశానికే తలవంపులు తెచ్చింది. అయినా సీమాంధ్ర మీడియా ఆయన నిర్వాకాన్ని ఆకాశానికి ఎత్తిన తీరు అసహ్యకరంగా ఉన్నది. తెలంగాణ బిల్లును అడ్డుకునే క్రమంలో లగడపాటి పెప్పర్ స్ప్రేను ప్రయోగించి సభను కకావికలు చేయడం సాధారణ విషయం కాదు. లగడపాటితో పాటు సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో చేసిన నిర్వాకానికి జాతీయ మీడియా నోట తిట్లు తినడం ప్రపంచమంతా కండ్లారా చూసింది. మీడియా మాత్రమే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నవారైనా ఈ ఎంపీల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. లగడపాటి దుశ్చర్య వల్ల భారత ప్రజాస్వామ్యం దిగజారిపోయిందనే సందేశం ప్రపంచం నలుమూలలకు ప్రసారమైంది.

ఈ అబద్ధాల కోరు మీడియా పెత్తందారులకు కొమ్ముకాసే క్రమంలో వాస్తవాలను అలవోకగా వక్రీకరించగలదు. బాధితులను ఉన్మాదులుగా చూపగలదు. ఉన్మాదులకు బాధితుల ముసుగు కప్పగలదు. లగడపాటి ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే ఉపయోగించానని ఇంత బరితెగించి చెబుతున్నాడూ అంటే ఈ సీమాంధ్ర మీడియా అండదండలు ఉండడం వల్లనే. సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణకు చేసిన అన్యాయాలను ఏనాడూ వేలెత్తి చూపని మీడియా ఉద్యమాన్ని మాత్రం కించపరచడంలో ముందుంటుంది. మిలియన్ మార్చి సందర్భంగా వలసవాదుల ప్రతీకలను కూల్చివేస్తే నానా హంగామా చేసిన ఈ మీడియా ఇటీవల సమైక్య ఉద్యమం పేర సాగిన విధ్వంసాన్ని మాత్రం ఘనంగా చూపించింది. ప్రభుత్వమే ముందుండి సినిమా షూటింగ్ మాదిరిగా తతంగం నడిపినా ఈ మీడియా కండ్లకు కనిపించలేదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందీ, ఇక్కడి సమస్యలు ఏమిటి, పరిష్కార మార్గాలు ఏమిటి మొదలైన అంశాలను సీమాంధ్ర ప్రజల ముందు పెడితే పరస్పర అవగాహనకు తోడ్పడేది. సీమాంధ్ర పెత్తందారులపై ఒత్తిడి పెరిగి తెలంగాణ సమస్యలు తీరిస్తే రాష్ట్ర సమైక్యత కాపాడడానికి అటునుంచి కొన్ని ప్రయత్నాలు సాగేవి. కానీ సీమాంధ్ర మీడియా పెత్తందారులు, వారి పెంపుడు చిలుకల కట్టుకథనాలనే ప్రసారం చేశాయి తప్ప వాస్తవాలను వెల్లడించలేదు. రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు ప్రాంతాల మధ్య సామరస్య సంబంధాలు ఉండే విధంగా చూడ డం మీడియా నైతిక బాధ్యత.

కానీ ఈ చానెళ్ళు, పత్రికలు సీమాంధ్రలోని ప్రజలలో విద్వే షం రగిలే విధంగా, తెలంగాణలో స్థిరపడిన వారికి అనుమానాలు కలిగే విధంగా వార్తాకథనాలు వెలువరించి తమ బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నాయి. పెట్టుబడిదారులు, రాజకీయ పార్టీలు, మీడియా ఎంతగా కలిసి పోయా యీ అంటే సీమాంధ్ర వర్గాల నుంచి కొత్త పత్రిక లేదా చానెల్ వస్తున్నదీ అంటే సగటు పాఠకుడు లేదా వీక్షకుడు ఏ పార్టీ తరఫున ఏకులం నుంచి వస్తున్నదని అడిగే స్థితికి జర్నలిజం విలువలు దిగజారాయి.


వస్తువులను ఉత్పత్తి చేసే వర్గమే ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది అనే అభిప్రాయం ఉన్నది. ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తి చేసే మాయాజాలంలో అమెరికా మీడియాది అందెవేసిన చేయి. రెండవ ప్రపంచ యుద్ధం సాగినంత కాలం శత్రువులను విలన్లుగా చిత్రీకరించి యుద్ధం తప్పనిసరి అన్నట్టుగా ప్రజల ఆలోచనలను మలచడంలో పాశ్చాత్య మీడియా హీన స్థితికి దిగజారింది. ఇరాక్‌పై దాడి సాగుతున్నప్పుడు అమెరికా, బ్రిటన్‌లలోని పేరు మోసిన వార్తా సంస్థలు కూడా వక్రీకరణలకు పాల్పడుతాయనేది వెల్లడైంది. సిరియాపై సాగుతున్న మీడియా దాడి ఇందుకు మరో ఉదాహరణ. అమెరికా దురాక్రమణలను ఆయా దేశాలను ఉద్ధరించేందుకు చేసేవిగా చూపుతున్నాయి.

అమెరికాలో పెట్టుబడిదారులు మీడియాను శాసించడం సాధారణమై పోయింది. చివరకు వాల్‌మార్ట్ తన దుకాణాలలో పత్రికను పెట్టి అమ్మబోనని బెదిరిస్తే టైమ్ మాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కథనాన్ని మార్చవలసి వచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర మాయాజాలం అమెరికాను మించి పోయింది. ఇక్కడ పెత్తందారులు, మీడియా రెండూ కలెగలిసిపోయిన కొమ్మలు. కానీ జాగతమైన తెలంగాణ సమాజం ముందు సీమాంధ్ర మీడియా కుప్పిగంతులు సాగవు. అమెరికా పౌరుల కన్నా తెలంగాణవారు ఎక్కువ భావ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు.

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. పార్లమెంటులో గొడవలు చేసేవారిపై చర్యలు తీసుకొని సభా కార్యక్రమాలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఒకప్పుడు పచ్చపూస మాదిరిగా బిల్లును ప్రవేశ పెట్టిన లగడపాటి ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. సీమాంధ్ర ఉన్మాదులు లగడపాటిని భగత్ సింగ్‌తో పోల్చినంత మాత్రాన అతడు గొప్పవాడైపోడు. ఇవాళ దేశమంతా దేశం బయటి నుంచి వచ్చి చేసిన కసబ్ దాడికన్నా లగడపాటి పార్లమెంటు లోపల చేసిన దాడి ప్రమాదకరమైందని అతడు శిక్షార్హుడని అంటున్నది. ఇదీ తెలంగాణ ఉద్యమం సాధించిన విజయం.

251

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

country oven

Featured Articles