పీడ వదిలినట్టే!


Fri,January 31, 2014 12:31 AM

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ
పీడ వదిలించుకునే రోజు రావాలని కోరుకుందాం.

తెలంగాణ బిల్లుపై ఎట్టకేలకు అసెంబ్లీలో అభిప్రాయ వ్యక్తీకరణ ముగిసి రంగం ఢిల్లీకి మారడం తెలంగాణ వారికి ఊరట కలిగిస్తున్నది. రాష్ట్రపతి పంపిన బిల్లుపై అభిప్రాయ వ్యక్తీకరణ గడువు ఈ రోజుతో పూర్తవుతున్నదని దీంతో చర్చ ముగిస్తున్నామని గురువారం అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. సభ్యులు సభలో చెప్పిన, రాతపూర్వకంగా తెలిపిన అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపిస్తామని కూడాస్పీకర్ స్పష్టం చేశారు. ఆ తరువాత స్పీకర్ మరో అంశంగా తెలంగాణ బిల్లును తిరస్కరించాలని కోరుతున్న తీర్మానాన్ని చేపట్టారు. అసెంబ్లీతో పాటు శాసన మండలిలో కూడా ఇదే రీతిలో అభిప్రాయ వ్యక్తీకరణ ఘట్టం ముగిసిన తరువాత మరో అంశంగా తిరస్కరణ తీర్మానాన్ని చేపట్టారు. అయినా చర్చ చివర తీర్మానం చేపట్టి బిల్లును తిరస్కరించామని సీమాంధ్ర నాయకులు ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. రాష్ట్రపతి పంపిన బిల్లుపై సాగిన అభిప్రాయ వ్యక్తీకరణకు, ఆ తరువాత చేపట్టిన తీర్మానానికి సంబంధం లేదని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేయడం గమనార్హం.

ఆర్టికల్- ఘైపకారంగా అసెంబ్లీ అభిప్రాయాలు రాష్ట్రపతికి, శాసనసభ రూల్ 77 ప్రకా రం ఆమోదించిన ముఖ్యమంత్రి తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే పంపిస్తా మని డిప్యూటీ స్పీకర్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయినా ఇదేదో బ్రహ్మాండం బద్దలయినట్టు ప్రచారం చేయడం ఆంధ్ర నాయకత్వానికి వారికి మద్దతిస్తున్న మీడి యాకే చెల్లుతుంది.

రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయ వ్యక్తీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీలో ఏ బాగోతం ఆడినా పట్టించుకోవలసిన అవసరం కేంద్రానికి ఉండదు. బిల్లుపై అసెంబ్లీ తీర్మానం చేసినా దానికి విలువ ఉండదని ఢిల్లీ పెద్దలు కూడాఅంటున్నారు. అయినా మూజువాణి తీర్మానం పేరుతో సీమాంధ్ర నాయకులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా, సభ్య సమాజం తలదించుకునేదిగా ఉన్నది. మూజువాణి తీర్మానం ఆమోదించిన తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర విభజన వంటి కీలకమైన అంశంపై తూతూ మంత్రంగా మూజువాణి ఆమోదం సబబు కాదు. మూజువాణి తీర్మానంపై కొందరు సభ్యులు ఔనని, కొందరు కాదని చెప్పవచ్చు. అయితే ఎవరి సంఖ్య ఎంత ఉన్నదో స్పష్టంగా అవగాహనకు వచ్చే పరిస్థితి ఉండాలె. దీనిపై సందేహాలు ఉంటే ఓటింగ్ జరపమని కోరే అవకాశం సభ్యులకు లభించాలె. నిరంతరాయంగా అరుపులు వినవచ్చినప్పుడు దానిని మూజువాణిగా పరిగణించకుండా ఓటింగ్ జరిపి వాస్త వ పరిస్థితి తెలుసుకోవడం పార్లమెంటరీ పద్ధతి.

కానీ సభలో జరిగింది కుట్రపూరిత మోజువాణి తీర్మా నం! తెలంగాణకు చెందిన శాసన సభ్యులను వెనకకు నెట్టివేసిన సీమాంధ్ర నాయకులు స్పీకర్ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. వారి అరుపుల మధ్య బిల్లును వ్యతిరేకించే తీర్మానాన్ని సభ మూజువాణిగా ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరం. అసెంబ్లీలో తెలంగాణతో పోలిస్తే సీమాంధ్రకు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య ఎంత ఉన్నదనేదే ప్రశ్నార్థ కం. బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, సీమాంధ్ర నాయకులు ఓటింగ్‌కు పట్టు బట్టే వారు. కానీ ఆ సాహసం విభజనను వ్యతిరేకించే సీమాంధ్ర నాయకులకు లేకపోవడం గమనార్హం.

ఆనాడు తెలంగాణ, ఆంధ్ర విలీనాన్ని హైదరాబాద్ అసెంబ్లీ ఆమోదించిందనేది ఎంత అబద్ధమో, ఇప్పుడు రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందనడం కూడా అంతే అబద్ధం. తెలంగాణ ఆకాంక్షను అణగదొక్కి, తమ పెత్తనం కొనసాగించడానికి సీమాంధ్ర పెత్తందారులు ఏ అడ్డదారైనా తొక్కుతారు, ఎంతకైనా తెగిస్తారు. 1969లో వందలాది మంది యువకులను పిట్టల్లా కాల్చి చంపడమైనా, ఇవాళ నిండు సభలో తెలంగాణ సభ్యులను వెనక్కు నెట్టి అరుపులతో మోజువాణి తీర్మానం చేయడమైనా ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేయడమే.

రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందంటూ కొందరు సీమాంధ్ర నాయకుల బంట్లు విజయోత్సవాలు జరపడం కూడా వారి బుద్ధి వైపరీత్యాన్ని సూచిస్తున్నది. విజయం ఎవరి మీద ఎవరు సాధించారట? సీమాంధ్ర నాయకులకు ఇంగితం లేక పోయినా టీవీ చానెళ్ళు కొంత వివేకం ప్రదర్శించాలె. విలువలకు కట్టుబడి ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన మీడియా అసత్య ప్రచారానికి దిగి పెత్తందారుల కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికి చేటు. రాష్ట్ర విభజన తప్పనిసరి అని తెలిసిపోయింది కనుక - సీమాంధ్ర నాయకులు సభలో లభించిన అవకాశాన్ని తమ ప్రాంత ప్రయోజనాలు చర్చించుకోవడానికి ఉపయోగించుకోవాలె. మీడియా కూడా ఇందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలె. కానీ సీమాంధ్ర నాయకులు కొన్ని వారాల పాటు సభా సమయాన్ని వథా చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నామని ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించారు.

సీమాంధ్ర మీడియా ఇందుకు వంత పాడింది. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పెత్తందారులపై సాగిస్తున్న పోరాటాన్ని మరో ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకమైందిగా చూపి విద్వేషాలు రగిలించడానికి యత్నించింది. ఈ నాయకులు గడువు ముగిసే దశలో- రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ పీడ వదిలించుకునే రోజు రావాలని కోరుకుందాం

390

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

country oven

Featured Articles