అతి పాత వాదనలు!


Fri,January 24, 2014 12:09 AM

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎవరూ వ్యక్తి కాదు. ఆయన చట్టసభల ప్రతినిధుల బందానికి, ముఖ్యంగా రాష్ర్టాన్ని ఏలే మంత్రివర్గపు సమష్టి నాయకుడు. కానీ అసెంబ్లీలో ఆయన విభజన చర్చలో పాల్గొంటూ తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అనడమే ఒక వివాదం.

వ్యవహర్తలు, రాజ్య నిర్వాహకులు, నాయకులు సామాన్యులకు మధ్యన స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. వ్యవస్థలను నడిపేవాళ్ల నుంచి సహజంగానే ప్రజలు ఉన్నతస్థాయి సంప్రదాయాలు, విలువలు కూడా ఆశిస్తారు. ముఖ్యమంత్రి, ప్రధాని లాంటి ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి ప్రజాస్వామ్య దేశం కనుక, రాజ్యాంగ నియమాలకు బద్ధులై ఉండాలని ఆశిస్తారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, ఉద్వేగాలకు, ఈర్ష్యలకు, దురభిమానాలు, దురభిప్రాయాలకు దూరంగా స్థిత ప్రజ్ఞత కలవారే నేతలుగా అందరినీ ఒప్పించగలరు. కీర్తించడానికి కూడా అర్హులు కాగలరు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉన్నా, జరుగుతున్న వ్యవహారం వ్యక్తిగతంగా ఏమాత్రం నచ్చనిదైనా వ్యవస్థలకు నాయకత్వం వహించేవారు సంయమనం కోల్పోకుండా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, మరీ ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరుకుంటారు. బహుశా ఇవన్నీ స్టేట్స్‌మన్ లక్షణాలని చెప్పవచ్చు. మామూలు కంపెనీల యజమానులే ఆ కంపెనీల క్షేమం దష్ట్యా వ్యక్తిగత ప్రవర్తనను అదుపు చేసుకొని, కంపెనీ ప్రయోజనాలు కాపాడే సామూహిక ప్రవర్తనలో భాగంగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు, ఏమాత్రం దాచుకోలేకుండా ఉన్న ఉక్రోశ, ఆక్రోశాలు, అసహనం బయటపెట్టుకుని భీష్మ ప్రతిజ్ఞలు చెయ్యడం, నిరాశ ప్రకటించడం ఆయనకు, ఆ పదవికి శోభనివ్వనివే.


వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటే నే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎవరూ వ్యక్తి కాదు. ఆయన చట్టసభల ప్రతినిధుల బందానికి, ముఖ్యంగా రాష్ర్టాన్ని ఏలే మంత్రివర్గపు సమష్టి నాయకుడు. కానీ అసెంబ్లీలో ఆయన విభజన చర్చలో పాల్గొంటూ తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అనడమే ఒక వివాదం. మంత్రివర్గంలో సభ్యులు కొందరు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఉన్నప్పుడు వారిని మాట మాత్రం సంప్రదించకుండా ఆయన ఏకపక్షంగా బిల్లును వ్యతిరేకించారు. పైగా పార్టీస్వామ్యంలో ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ బిల్లు వచ్చిన తరుణంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే చర్చ కొనసాగించడం ఏమి నైతికత? ముఖ్యంగా నాయకుడికి రాజ్యాంగబద్ధత, ఇతరులు వేలెత్తి చూపలేని నైతిక ధతి ఉన్నప్పుడే రాణిస్తారు.
చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చరిత్రలోకి వెళ్లా రు. జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలం గా తీర్మానం చేసి ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా ముఖ్యమంత్రి మూడు నాలుగు సందర్భాల్లో తీరుపాటంగా విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడిన మాటల పునశ్చరణగానే మొత్తం ఆయన ప్రసంగం సాగుతున్నది. తెలుగువారు కలిసి ఉన్న చరిత్ర, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు, ఆ తర్వాత ఇది వరకే శైలజనాథ్, పయ్యావుల కేశవ్‌లు చెప్పిన తీరుగానే తెలంగాణ వారు విశాలాంధ్ర కోరుకున్నందువల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న అతి పురాతనమైన వాదననే ముఖ్యమంత్రీ వినిపించారు.

ఈ వాదనలకు సంబంధించి, ముఖ్యమంత్రి గానీ, సీమాంధ్రులు గానీ ఎవరు చెప్పిన విషయాలయినా రికార్డుల్లో ఉన్నాయని ఉటంకింపులూ ఇస్తున్నరు. కానీ అప్పటి పరిస్థితులు, ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడిన పెద్దల మాటలు, అన్నింటికి మించి విలీన సమయంలో తెలంగాణ ప్రజల వ్యతిరేకతలపై ఇప్పటికే ఆధారాలతో సహా తెలంగాణ వాదనలు వందలసార్లు వినిపించారు. కర్నూలు రాజధానిగా గుడారాల పాలన నుంచి, అప్పటికే అద్భుతమైన మౌలిక వసతులతో సర్వసిద్ధంగా ఉన్న హైదరాబాద్ నగరం మీద కన్నేసి ఆంధ్ర పెద్దలు విలీనానికి కేంద్ర సంబంధాలను ఉపయోగించుకుని లాబీయింగ్ చేశారని అనేకసార్లు చెప్పారు. బూర్గుల రామకష్ణరావు ఏఐసీసీ అప్పటి అధ్యక్షుడు దేవ్‌రాకు రాసిన లేఖ విలీనానికి ఎందుకు వ్యతిరేకమో, ఏ భయాలున్నాయో చెప్పింది. అట్లాగే విలీన ఒప్పందాల మీద సంతకం పెట్టివచ్చి ఇవ్వాళ నా మరణ శాసనం మీద నేనే సంతకం చేసి వచ్చాను అన్న తీవ్రమైన మాట కూడా బూర్గుల వాడారన్నది చరిత్రలో రికార్డయి ఉన్నదే. ఇదొక్కటే కాదు. బలవంతపు విలీనం కనుకనే, ఒప్పందాలు, షరతులు. ఆంధ్రులు విశాల దక్పథంతో వ్యవహరించాల్సిన అవశ్యకతలను అలనాడు నెహ్రూ స్వయంగా బోధించారు. ఇది తెలంగాణవాదుల చెప్పీ చెప్పీ నెరిబడినా ముఖ్యమంత్రి మళ్లీ అదే పాట పాడారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు స్పష్టంగా ఉన్నప్పటికీ మరోసారి ఆ సిఫార్సులలో ఉన్న ఇతర అంశాల ఉటంకింపులు చేశారు. నిజానికి ఇవన్నీ కాలం చెల్లిపోయి, తెలంగాణవాదం నిలిచి గెలిచి అసెంబ్లీకి బిల్లు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఆయన వద్ద సమైక్యాంధ్రను సమర్థించుకునేందుకు ఒక కొత్త వాదనాలేని, సమగ్ర వాదనలేని బలహీనతనే చాటాయి.

నీళ్ల మీద, వ్యవసాయం మీద, పంటల మీద, ప్రాజెక్టుల మీద ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా పాక్షిక సత్యాలతో నిర్ధారణకు నిలవకుండా తేలిపోయాయి. అయి నా ముఖ్యమంత్రి మాటలు, ఆయన ప్రసంగం తీరు బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి అన్నట్టు పళ్లై, పిల్లలు పుట్టినాక, పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు చెర్లనీళ్లు పొయ్యి చెరువెనుకపడ్డట్టు ప్రయోజనంలేని నిష్ఫల ప్రసంగంలా ఉన్నది. ముఖ్యమంత్రికి ఆయన పదవికి తగినట్టుగా ఆయన ప్రసంగం లేదని చెప్పక తప్పదు.

417

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles