కొత్త కాలం


Wed,January 1, 2014 01:03 AM

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్రా పాలకవర్గాల అవశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా తెలంగాణను శాసించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ అడ్డంకులను అధిగమిస్తూనే తెలంగాణ సమాజం ముందుకు సాగాలె.
దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకునే రోజు కోసం తహతహలాడుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ ఏడాది ఇంటింటా కొత్త పటాలు గోడలపై వేలాడుతాయి. అందుకే కొత్త సంవత్సర ఆనందం తెలంగాణ వారిలో తొణకిసలాడుతున్నది. ఇది తెలంగాణ సంవత్సరం.

అనుమానం లేదు... దశాబ్దాల పోరాట ఫలాన్ని అందిస్తున్న ఏడాది ఇది. తెలంగాణ సాధించుకుంటాం... అవును మేం సాధించుకు తీరుతాం అనే దృఢ సంకల్పంతో తెలంగాణ జనం కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నరు. తెలంగాణ ఉద్యమం సృష్టించిన అనివార్యతల మూలంగా ఎన్నికల లోపే తెలంగాణ ఏర్పడవచ్చు. ఏ కారణాల వల్లనైనా ఎన్నికలలోపు ఏర్పడకపోతే, ఆ తరువాతనైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామనే ధీమా ప్రజలకు ఉన్నది. ఈ నమ్మకం కేంద్రం వల్ల కాదు, తమ పోరాటం నుంచి పుట్టింది. ఏ కారణాల వల్ల అయినా కొత్త ఏడాది చరివూతాత్మకమైనది. తెలంగాణ చరివూతలో నిర్ణయాత్మకమైనది.
కొత్త సంవత్సరం రాష్ట్ర ఆకాంక్షను తీర్చడమే కాదు, కొత్త సవాళ్ళను కూడా విసురుతుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతోనే ఉద్యమం ఆగిపోదు. తెలంగాణ ఆకాంక్షలు తీర్చుకోవడానికి రాష్ట్ర ఏర్పాటు కనీస ప్రాతిపదిక. పరాయి పాలన పోయి సొంత రాష్ట్రంలో స్వపరిపాలన ప్రారంభమవుతుంది. ఈ స్వపరిపాలనలో ప్రజల ఆకాంక్షలు తీర్చడం ఎట్లా అనేది విధానకర్తల ముందున్న సవాలు. తెలంగాణ రైతులకు నీటి పంపకంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలె. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలె. తెలంగాణ అభివృద్ధి కోసం మన నిధులను మన ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలె. ఇందుకు తెలంగాణ ఇంజనీర్లు ఇతర రంగాల మేధావులు పథక రచనలు చేస్తున్నారు.

వాటిని సక్రమంగా అమలు చేయాలె. నీళ్ళు, కొలువులు, నిధులు ప్రధానంగా మనం నష్టపోయిన రంగాలుగా కనిపిస్తున్నాయి. కానీ పైకి కనిపించని పరోక్ష నష్టం అంతులేని స్థాయిలో జరిగింది. దశాబ్దాల పరాయి పాలనలో తెలంగాణ అనేక రంగాలలో చితికి పోయింది. దాదాపు మూడు తరాలు వెనకబడ్డది. ఆర్థిక సామాజికాది రంగాలలో మిగతా సమాజాలతో సమాన స్థాయిలో ఉండడానికి ఒక పెద్ద గంతు అవసరం. ప్రపంచీకరణ విధానాలు అమలయ్యే వరకు దేశంలో అనేక సంక్షే మ పథకాలు అమలయ్యాయి. ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్షికమాలు జరిగాయి. అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. ఇవన్నీ తెలంగాణకు దక్కకుండా అన్యాయం జరిగింది. దీని వల్ల ఉన్నత, మధ్యతరగతి వర్గాలు తమ అర్హతకు తగిన అవకాశాలు పొందలేక పోయారు. ఈ నష్టం పుస్తకాలకు ఎక్కినంతగా అట్టడుగు వర్గాలకు జరిగిన నష్టం గుర్తింపునకు నోచుకోలేదు. గ్రామీణ అట్టడుగు వర్గా లు కనీస మనుగడ సాధించలేక బొంబాయి, దుబా యి పోవలసి వచ్చింది. అనేక కుటుంబాలు సంక్షోభంలో పడిపోయాయి. జీవితాలు ఛిద్రమయ్యాయి. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కుదుట పడాలంటే ఉద్యమ స్ఫూర్తితో భిన్న రంగాలలో అభివృద్ధి పథకాలు అమలు జరగాలె. తెలంగాణ అభివృద్ధికి సమగ్ర వ్యూహం రూపొందించుకోవాలె.


వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం ప్యాకేజీలు ఇస్తామంటున్నది. కానీ ఈ కాలంలో ప్యాకేజీలు మౌలిక వసతుల అభివృద్ధి కోసమే అయి ఉంటాయి. తెలంగాణ సమాజం ఇంత కాలం పరాయి పాలనలో మగ్గడానికి, స్వీయ పాలనలో అభివృద్ధి పొందక పోవడానికి కేంద్రం బాధ్యత కూడా ఉన్నది. అందువల్ల తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రపంచీకరణకు ముందు అమలయిన సంక్షేమ పథకాలను, విధానాలను తెలంగాణలో కొనసాగించవలసిన అవసరం ఉన్నది. తెలంగా ణ కోసం అంటే దేశ సంక్షేమం కోసం కూడా. రాష్ట్ర నాయకత్వం ఈ విషయమై కేంద్రాన్ని ఒప్పించాలె. ఇప్పుడు అమలవుతున్న ఆర్థిక విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సామాజికాభివృద్ధికి ఎంతమేర ఉపయోగించుకో గలుగుతామనేది కూడా పరిశీలించాలె. తెలంగాణ పునర్నిర్మాణం విషయంలో రాజకీయ, ఉద్యమ శక్తులకు స్పష్టత ఉండాలె. రాజకీయ, ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఏమేర ఉపయోగించుకో గలుగుతాయనేది కూడా ముఖ్యమే. తెలంగాణ సాధనకు ప్రజల చైతన్యం, రాజకీయ ఉద్యమ శక్తుల పాత్రతో పాటు అనేక అంశాలు తోడ్పడ్డా యి. అయితే ప్రజా చైతన్యానికి తగ్గట్టుగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో రాజకీయ, ఉద్యమ నాయకత్వాలు ఆశించిన మేర సఫలం కాలేదు. కనీ సం పునర్నిర్మాణం సందర్భంగానైనా ఈ బలహీనతను పూడ్చుకోగలగాలె.


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్రా పాలకవర్గాల అవశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా తెలంగాణను శాసించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ అడ్డంకులను అధిగమిస్తూనే తెలంగాణ సమాజం ముందుకు సాగాలె. ఈ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలె. ఉద్యమంలో అసమాన చైతన్యాన్ని ప్రదర్శించిన ప్రజలు పునర్నిర్మాణంలో కూడా అదే రీతిలో పరిణతితో వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరం నిజంగా కొత్తదనాన్ని అందిస్తుంది.

378

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...