అంతటా ఇవే నాటకాలు


Sat,December 28, 2013 12:44 AM

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానానికి లేదా చర్చకు సంప్రదాయమని నామకరణం చేసి ఇక్కడ అమలు పరచాలని కోరుతారట! సూటిగా చెప్పాలంటే- ఆ ఉత్తరాది నాటకాన్ని ఇక్కడ కొత్త వేషాలు కట్టి ఆడడమే వీళ్ళు చేసే పని! వీరి పసలేని వాదనలేవీ హేతుబద్ధమైన చర్చకు నిలబడవు. మూడు రాష్ట్రాల విభజన సందర్భంగా అసెంబ్లీ తీర్మానాలు జరగడం మినహాయింపు మాత్ర మే. మిగతా రాష్ట్ర విభజనలన్నీ ఏ తీర్మానం లేకుండానే జరిగాయి.

అఖిల పక్ష సమావేశంలో అంతా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించారు.
మీరు తీర్మానం ప్రవేశ పెడితే మేం మద్దతు ఇస్తామని సవాలు విసురుకుంటూ నాటకాలు ఆడారు.
అసెంబ్లీ తీర్మానం చేయలేదు కనుక
ఆ సాకును చూపి తప్పించుకోవాలనుకున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం
తీర్మానం అవసరం లేదు కనుక తాము పన్నిన ఉచ్చులో చిక్కిపోయారు.
ధర్మబద్ధత లేని రాజకీయాలు నడిపితే
ఇటువంటి గతే పడుతుంది.


ఈ మూడు రాష్ట్రాల విభజనకు కూడా అంతిమంగా కేంద్రం చొరవే ప్రధాన కారణం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండామినహాయింపులను చట్టంగా లేదా సంప్రదాయంగా పేర్కొనడం అవగాహనా రాహిత్యం! ఇప్పటి వరకు రాష్ట్ర విభజనలన్నీ చెమ్మచెక్కలాడినట్టుగా ఆనందోత్సాహాలతో సాగినట్టు, ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రం చట్ట విరుద్ధంగా, ధర్మవిరుద్ధంగా సాగుతున్నట్టు, ఒక ప్రాంత నాయకులు వ్యతిరేకిస్తుండగా విభజించకూడదన్నట్టు సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. పంజాబ్ నుంచి అస్సాం వరకు ఏ రాష్ట్ర విభజన చరిత్ర చూసినా ఒకే విధంగా ఉన్నది. లబ్ధి పొందుతున్న ప్రాంత నాయకులు వీలైనంత వరకు అడ్డుపడడం సాధారణం.


పంజాబ్ రాష్ట్ర విభజన మిగతా వాటితో పోలిస్తే అత్యంత సంక్లిష్టమైనదిగా చెప్పవచ్చు. రాష్ట్రపతి పాలన విధించి ఈ రాష్ట్రాన్ని విభజించ వలసి వచ్చింది. విభజన కావాలనే డిమాండ్ మొదట హర్యానా నుంచే కాదు, పంజాబ్ ప్రజల నుంచీ వచ్చిం ది. తీరా విభజన సమయానికి పంజాబ్ నాయకులు వ్యతిరేకించారు. ఇప్పుడు సీమాంధ్ర పెద్దలు ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో, ఆనాడు పంజాబ్ విభజన సమయంలో అక్కడి నాయకులూ చేశారు. పంజాబ్‌ను విభజిస్తే దేశ రక్షణకు ముప్పు ఏర్పడుతుందన్నారు. రెండు రాష్ట్రాలూ ఆర్థికంగా దివాలా తీస్తాయన్నారు. ప్రాంతీ య కమిటీలు అసెంబ్లీల వంటివనీ, వాటి ద్వారా అన్యాయాన్ని సరిదిద్దవచ్చునని నమ్మించ చూశారు. నిజానికి అప్పటికే ప్రాంతీయ కమిటీల ప్రయోగం విఫలమైంది. విభజన వ్యతిరేకులు చేసిన వాదనలేవీ కేంద్రంలోని నిపుణుల పరిశీలనకు నిలబడ లేదు. అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ యధాతథ స్థితి వల్ల ఉపయోగం లేదనే అభివూపాయం నెలకొని ఉన్న ది. కేంద్రం స్థిరమైన నిర్ణయం తీసుకోవలసిన చారివూతక అనివార్యత ఏర్పడ్డది.

అకాలీదళ్ (మాస్టర్ తారాసింగ్), జన సంఘ్, కమ్యూనిస్టు పార్టీ ఎవరి కారణాలతో వారు వ్యతిరేకించినా కేంద్రం దృఢంగా వ్యవహరించి విభజన ప్రక్రియను సాగించింది. పంజాబీ ప్రాంతాలను పంజాబ్‌లోనే ఉండనిచ్చి, హిందీ ప్రాంతాలను హర్యానాగా ఏర్పరచి, కొండ ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్‌కు బదలాయించింది. ఎక్కడైతే ఈ ప్రాంతీయ నాయకుల మాట చెల్లుబా టు అయిందో అక్కడే వివాదాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆనాడు పంజా బ్ నాయకులు లేవనెత్తిన అభ్యంతరాలే ఇప్పుడు సీమాంధ్ర నాయకుల నోట వింటున్నాం. సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి లొంగి కేంద్రం సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుండా ఏ కొర్రీ పెట్టినా మళ్లీ వివాదాలు భగ్గుమనడం ఖాయం.


ఇటీవల మూడు రాష్ట్రాల విభజన సందర్భంగా అందరినీ మెప్పించిన తరువాతే విభజన సాగిందనడం తప్పు. ఇక్కడ జరిగినట్టే అక్కడ కూడా నాయకులు కుప్పిగంతులు వేసిన మాట నిజం. ఈ కుప్పిగంతులకు సామాజిక కారణాలున్నాయి. రాజకీయ రంగంలో ఆధిపత్యవర్గాల పట్టు సడలుతున్న నేపథ్యంలో ప్రాంతీయ భావనలను పైకి ఆమోదించి తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నాలను వివిధ పార్టీల నాయకులు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ ప్రజల ఆకాంక్షలకు ఎన్నికల సందర్భంలో నాయకులు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత వెనుకడుగు వేసే ప్రయత్నం చేశారు. ప్రతి పార్టీ తనదైన ఆట ఆడుతూ తప్పించుకోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఉదాహరణకు- బీహార్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకున్నది. కానీ బీహార్‌లో లాలూ ప్రభుత్వానికి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య పిల్లి- ఎలుక ఆట అప్పటికే మొదలైంది.

తనను దెబ్బ కొట్టడానికి రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాన్ని విభజించే కుట్ర సాగుతున్నదని లాలూ బహిరంగ విమర్శ చేశాడు. ఆ ప్రయత్నమూ సాగింది. తాము మాట మార్చినప్పటికీ కేంద్రం విభజనతో ముందుకు వెళుతుందని ఈ మూడు రాష్ట్రాల నాయకులు ఊహించలేక పోయారు. నిజానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు రాష్ట్రాలలో నాయకులు అసెంబ్లీ తీర్మానాలు చేసి ఇరుకున పడ్డారనే ఉద్దేశంతో ఇక్కడ సీమాంధ్ర నాయకులు అతి తెలివితో అసెంబ్లీ తీర్మానం చేయడం తప్ప మిగతా విన్యాసాలన్నీ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. పార్టీ తీర్మానాలు చేశారు, లేఖలు సమర్పించారు. అఖిల పక్ష సమావేశంలో అంతా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించారు. మీరు తీర్మానం ప్రవేశ పెడితే మేం మద్దతు ఇస్తామని సవాలు విసురుకుంటూ నాటకాలు ఆడారు. అసెంబ్లీ తీర్మానం చేయలేదు కనుక ఆ సాకును చూపి తప్పించుకోవాలనుకున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం తీర్మానం అవసరం లేదు కనుక తాము పన్నిన ఉచ్చులో చిక్కిపోయారు. ధర్మబద్ధత లేని రాజకీయాలు నడిపితే ఇటువంటి గతే పడుతుంది.

278

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...