మానుకోట రాయికి వందనం


Sun,May 27, 2012 12:11 AM

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వెంక వయసప్పుడు పదిహేనేళ్లు. చిన్న పిల్లవాడే. టెన్త్‌క్లాస్. ఇప్పుడు ఇంటర్. కానీ ఇప్పటికీ అతని మనసుకైన గాయం మాననే లేదు. యాతన పెడ్తుంటుంది. అది తెలంగాణ. కానీ దిడ్డి వెంక విసిరిన రాయి. అది మానుకోట రాయి ఏ తెలంగాణ ఇంట్లోనో మహిమగల్ల రాయిలాగా పూజలు అందుకుంటూ ఉంటుంది. మానుకోటకిప్పుడు రెండేళ్లు. భూమా ముదాకర్ అంతే. ఉస్మానియా విద్యార్థి. మానుకోట వీరుడు. జగన్ ఆధిపత్యం మీద, హజం మీద, సమైక్యవాదం మీద, జగన్ తొత్తుల మీద ముదాకర్ రాయి విసిరాడు. సమైక్య కలలను భళ్ళున పగలగొట్టాడు. అతనికీ రెండు తూటాల గాయాలున్నాయి. నెలకు నాలుగువేల రూపాయలు మందుల కోసం ఇప్పటికీ ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఆదుకున్న వారు లేరు. తల్లిదంవూడులు పళ్లు అమ్ముతూ కొడుకును సాదుకుంటున్నారు.

చేతికి మరో ఆపరేషన్ కావాలి. కానీ కాసులు లేవు. పౌలురాజు పరిస్థితీ అంతే. జగన్ దండయావూతపైన రాయి విసిరిన రాజుకూ రెండు బుల్లెట్లు తగిలాయి. ఎడమ కన్ను కనిపించడం లేదు. కుడిచెవి వినిపించడం లేదు. నిమ్స్‌లో వైద్యం. అప్పుడు తెలుసు. పాశం యాదగిరి వైద్యం చేయించిండు. కానీ మానుకోట రాయి జగన్ సమైక్య కలలను భగ్నం చేసి, కోసాంధ్ర ప్రాంతానికి పరిమితం చేసి తరిమేసిన రెండేళ్ల తర్వాతా పౌలురాజు తెలంగాణ వస్తేనే అందరి బతుకులు బాగుపడతాయంటడు. బుల్లెట్ గాయాలు సలుపుతున్నా ఇప్పటికీ ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తానంటడు.

మానుకోట రాయి విసిరిన సరిగ్గా రెండేళ్ల తర్వాత.. దిల్‌కుషా గెస్ట్‌హౌస్ నుంచి జగన్ బయటకొచ్చాడు. (ఇది మాధృచ్ఛికమేమీ కాదు.)మీడియాతో మాట్లాడాడు. మానుకోట నాటిలాగే జగన్ చిక్కుల్లో ఉన్నాడు. కానీ ఇప్పటి చిక్కు వేరు. కానీ జగన్ దిలాసాగానే ఉన్నాడు. నల్ల స్కార్పియో వాహనం సగం రెక్క తెరచుకుని ఎక్కి మీడియాతో ఉల్లాసంగానే మాట్లాడాడు. ‘వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. చెప్పాను. రేపు మళ్లీ రమ్మన్నారు. వెళ్తాను. చెప్తా ను’. చివరగా బైబైబై అని జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్లారు. స్కార్పియోల మంద వెంటరాగా.. స్కార్పియో వాహనాలు నల్లనివి. వాళ్ల నాన్నకు ఇష్టమైన బండ్లు. ఫాక్షన్ సినిమాల్లో ఒకప్పుడు టాటా సుమోలు వాడిన తెలుగు సినిమాలు ఇప్పుడివే నల్లని స్కార్పియో వాహనాలు వాడుతున్నారు. అట్లని జగన్ ఇప్పుడు ఫాక్షనిస్టు కాదు. అంతకుమించి ఎదిగిన కార్పొరేట్ రాజకీయ నాయకుడు. అచ్చంగా తెలంగాణకు అడ్డుపడ్తున్న లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి కార్పొరేట్ రాజకీయ నాయకుడు.

అట్లని వాళ్ల నాయిన కూడా ఫాక్షనిస్టుగా మాత్రమే మిగలలేదు. వై.ఎస్. రాజశేఖర్‌డ్డి ధోవతి ధరించిన భూస్వామ్య ప్రతినిధి, నల్ల స్కార్పియోల మీద మనసుపడే ఫాక్షనిస్టు స్థాయి నుంచి ప్రభుత్వ యంత్రాంగాలను, మంత్రులను, కార్పొరేట్లను, అధికార గణాన్ని కలెగలిపి దేశాన్ని ఎలా కొల్లగొట్టవచ్చునో? నేర్పించిన మహా వ్యాపారి. చిదంబరం కన్నా, మన్‌మోహన్‌సింగ్ కన్నా, మాంటెక్‌సింగ్ అహ్లువాలియా కన్నా సరళీకరణ విధానాల్లో సహజవనరులను కట్టబెట్టి ప్రజలకింత మేలుచేసి మహా సామ్రాజ్యాన్ని కొడుక్కి ఎట్లా నిర్మించి ఇవ్వాలో తెలిసిన వ్యాపార, ఆర్థికశాస్త్ర నిపుణుడు. అది వేరే చర్చ కానీ...
కొన్ని ప్రాంతాలకీ, సమయ సందర్భాలకీ ప్రాధాన్యత ఉంటుంది. అవి గొలుసు కట్టులా గత, వర్తమానాల వ్యాఖ్యానాలుగా ఉంటాయి. మానుకోట రాయికి ఉండే మహిమ అలాంటిదే. అది పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ నుంచి ప్లకార్డులు లాక్కుని సమైక్య నినాదం చేసి, పైగా ఓదార్పుకు బయలుదేరిన జగన్‌ను నిలువరించిన రాయి. జగన్‌ను మానుకోటలో అడుగుపెట్టకుండా నల్లగొండ జిల్లా వంగపల్లి రైల్వేస్టేషన్ నుంచి వెనక్కి పంపించిన రాయి.

అప్పుడూ అంతే నల్లని స్కార్పియో వాహనాల దండుతో, అప్పటి రోశయ్య అండదండలతో పోలీసుల తోడు రాగా జగన్ ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికింకా లోటస్‌పాండ్ చిరునామా లేదు. సాగర్ సొసైటీకి వెళ్లాడు. జగన్ అంటే మానుకోట ఎట్లా గుర్తొస్తుందో? ఇప్పటి దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో ఆయన మీద జరుగుతున్న విచారణలో కూడా తెలంగాణ వాళ్లు మానుకోట ఎట్లా మరిచిపోలేరో? సారూప్యత కోసమే ఇదంతా.. అట్లాగే జగన్ నాన్నగారు వై.ఎస్. రాజశేఖర్‌డ్డి చనిపోయిన ప్రాంతమూ అంతే నల్లమల. నల్లమల అంటే నక్సల్బరీ గుర్తొస్తుంది. మాధవ్ ఎన్‌కౌంటర్ గుర్తొస్తుంది. ఆర్‌కే అడుగుజాడ గుర్తొస్తుంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి విచ్ఛిన్నమైన, ఛిద్రమైన ముఖాలు గుర్తొస్తాయి. తాళ్లకు జంతు కళేబరాల్లా కట్టి కావడిలో మైదానాలకు మోసుకొచ్చిన శవాలూ గుర్తొస్తాయి. కానీ యాధృచ్ఛికమే అయినా వై.ఎస్. రాజశేఖర్‌డ్డి నల్లమలలోనే అంతమయ్యా రు. దేహం ముక్కలైన వై.ఎస్. పార్ధివ శరీరపు శకలాలు అక్కడి నుంచే ఏరుకొచ్చారు. నల్లకాలువలో తన నాన్న మరణం గురించి ఉద్వేగంగా ప్రసంగించిన జగన్‌మోహన్‌డ్డి ఓదార్పు పేరిట అక్కడి నుంచే కాంగ్రెస్ వ్యతిరేక ఎజెండాను ప్రకటించి రెండేళ్లుగా నిర్విరామంగా ఓదారుస్తూనే ఉన్నారు. ఆయన అక్రమాస్తుల కేసును సీబీఐ విచారిస్తున్నది.


పెట్టుబడుల రహస్యాల గుట్టువిప్పుతున్నది. మహా సామ్రాజ్యాన్ని తవ్వుతున్నది. కానీ జగన్ రాజకీయంగా ఇప్పటికీ ఒక సమర్థ నేత. భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన ‘నీతిగల నిజాయితీగల రాజకీయాల కోసం’ ఓటు అడుగుతున్నాడు. బహు శా భారతదేశంలో అదే విషాదం. లక్షకోట్లు కొల్లగొట్టిన ఆరోపణలు ఎదుర్కు నేవాళ్లూ నీతి గురించి మాట్లాడడమే విరోధాబాస. నీతికి సంబంధించి, నిజాయితీకి సంబంధించి, వాటి సాపేక్షతకు సంబంధించి మాట్లాడడానికి ఇంకే మి ఉంటుంది. చెప్పలేం.. ఏమో గుర్రం ఎగురావచ్చు. జగన్ పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవే కావొచ్చు. చట్టాలకు ఆయన దొరకక పోనూ వచ్చు. సీబీఐ కూడా అయనను ఏమీ చెయ్యలేక పోవచ్చు. భవిష్యత్తు ఆయనదే కావొచ్చు. అరెస్టు చేస్తే సానుభూతీ తోడు కావొచ్చు. జైలు కెళ్లి వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి కావొచ్చు. కానీ...
ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ పుచ్చిపోయింది.

సహజవనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం అడ్డం పడిన ప్రజాసమూహాలను అణచివేయడం, ఆదివాసులను, అండగా ఉన్న మావోయిస్టులను ‘గ్రీన్‌హంట్’ చేయడం ఇవ్వాల్టి అభివృద్ధి నమూనా. వ్యవస్థలో జగన్ ఒక్కడే నిందితుడో.. నేరస్తుడో.. కాజాలడు. జగన్‌పై సీబీఐ విచారణ నడుస్తున్నప్పుడు అయనకు నీతులు చెప్తున్న వారి నీతి, రీతి అదే. పదిహేడువేల కోట్ల సోలార్ పవర్ కుంభకోణంలో పేరు బయటకొచ్చిన కంపెనీలుగల లగడపాటి రాజగోపాల్ కూడా జగన్‌కు నీతి చెప్తాడు. వై.ఎస్.ఆర్ పప్పుబెల్లాలు పంచి ప్రజాధనం దోచుకున్నాడని ప్రవచించే చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో ప్రతి మనిషికీ రెండు వేల నగదు బదిలీ గురించి ప్రణాళికలు వేస్తుంటాడు. కార్పొరేట్, అధికారగణం, సహజ వనరుల అప్పగింతకు ఆద్యడైన చంద్రబాబు జగన్‌కు నీతులు చెప్తాడు. కూతురు ఇంట్లో ఐటీ దాడుల్లో కోట్ల నగదు సంగతేమిటని సామాన్యుడు అడిగితే నోరుతిరగని చిరంజీవీ అంతే.. ఆయన కూడా పవివూతత గురించి మాట్లాడతారు. మద్యం కుంభకోణంలో పీకలలోతు మునిగిన బొత్స జగన్‌కు నీతులు చెప్తా డు.

సారాంశం ఒక్కటే. రాయి విసరజాలని చరివూతలు గల వారు మీలో నేరం చెయ్యని చరిత్ర లేని వాళ్లు. అందరూ ఒకే తానులో ముక్కలుగా కనపడ్తున్న ఒకానొక విచిత్ర స్థితి. నేరం వ్యవస్థలో వుంది. నేరం అది అనుసరిస్తున్న విధానాల్లో ఉంది. భాగ్యవంతుల చేతుల్లో బందీ అయిన భారతావని అంగలారుస్తున్నది. త్రీజీ కావొచ్చు. టూ జీ కావొచ్చు. అది సెజ్ కావొచ్చు. సోలార్ ప్రాజెక్టు కావొచ్చు. హైవే కావొచ్చు. అది కాంట్రాక్టు కావొచ్చు. ఆనకట్ట కావొచ్చు. అభివృద్ధి నమూనాలో బార్లా తెరిచిన మార్కెట్‌ల విస్తరణ మాయా జాలాల్లో భారతదేశపు సహజవనరుల దోపిడీ ఉంది.

మానుకోటకు రెండేళ్లు. నక్సల్బరీకి సరిగ్గా నలభై ఐదేళ్లు. కుళ్లిన వ్యవస్థకు శస్త్ర చికిత్స ప్రతిపాదించిన రాజకీయాల ఆవిర్భావానికి సరిగా నాలుగున్నర దశాబ్దాలు. ‘స్వార్ధం శిరస్సును గండ్ర గొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో’అని శివసాగర్ ప్రకటించారు. అది గోడ మీద నినాదం కాదు. అది భారతావనిలో నక్సల్బరీలో పుట్టి, శ్రీకాకుళంలో మేరిమి కొండల్లో మెరిసిన మేఘ మై, తెలంగాణలో జగిత్యాల జైత్రయావూతయి, దండకారణ్యంలో డేరా వేసుకొని అబూజ్‌మడ్ పర్వత శ్రేణుల్లో వసంతమేఘ గర్జనలు వినిపిస్తున్నది. నిజమే ఇంతదోపిడీ ? నిజమే ప్రజలు హౌలాగాళ్లా? నిజమే ఏదో ఒకటి జరగాలి! ఈ దోపిడీకి అంతం లేదా? ఇంత పతనమైన , ఇంత హీనమైన , ఇంత కుళ్లి పోయిన, ఇంత వ్యవస్థీకృతమైన అన్యాయాలపై ఉత్త అక్రోశమేనా? అంకుశాలేవీ? బహుశా అదే నక్సల్బరీ... జగన్ ఒక వ్యవస్థ. జగన్ ఒక్కడు కాడు.

అతడొక్కడు మారడు. మానుకోట రాయి ఒక్కటి సరిపోలదు. కుళ్లిన రాచపుండుకు నిజంగానే సాయుధ శస్త్ర చికిత్స జరగాల్సిందే...మానుకోటలో వెంకటేష్ జగన్ లాంటి వ్యవస్థీకృత సమైక్య దోపిడీపై రాయి విసిరాడు. ఈ మూలం సామ్రాజ్యవాదంలో ఉంది. దాని తైనాతీల్లో ఉంది. మానుకోట.. అబూజ్‌మఢ్ కాకూడదంటే పాలకులు తెలంగాణ ప్రకటించవలసి ఉంది. మానుకోట రాయికి వందనం.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles