చిరస్మరణీయ యాత్ర


Sun,December 16, 2018 12:32 AM

ysrs biopic yatra movie release date on 8th of february 2019

దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని రూపొందిస్తున్న చిత్రం యాత్ర. వైయస్‌ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. మహి.వి.రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మడమతిప్పని మహానాయకుడి జీవిత చరిత్రలోని కీలకాంశాలను స్పృశించే చిత్రమిది. వైయస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి పరకాయప్రవేశం చేశారు. ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పాదయాత్రలో వైయస్‌ఆర్ లక్షలమంది ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. జనంతో మమేకమై వారి భావోద్వేగాలను అర్థం చేసుకున్నారు.

యాత్ర ఆరంభం నుంచి ముగింపు వరకు జరిగిన చిరస్మరణీయ సంఘటనల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. వైయస్‌ఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నాం అన్నారు. రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యసూర్యన్, సంగీతం: కె (క్రిష్ణకుమార్), నిర్మాణ సంస్థ: 70ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి వి రాఘవ్.

1396

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles