వైయస్‌ఆర్ ఆశయాల్ని గుర్తుచేశారు!


Mon,February 11, 2019 11:54 PM

ys vijayamma emmotional speach on yatra movie

కోట్లాది మంది ప్రజల హృదయాంతరాల్లో దాగిఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని ప్రజల కోసం ఆయన పడిన ఆరాటం, తపన, ఆశయాలు, సంక్షేమ పథకాల్ని యాత్ర సినిమా ద్వారా దర్శకనిర్మాతలు గుర్తుచేశారు అని అన్నారు వై.ఎస్. విజయమ్మ. మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి.వి.రాఘవ్ దర్శకుడు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ మేక సమర్పణలో శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా నిర్మించారు. సోమవారం ఈ చిత్రాన్ని దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కించి విజయవంతంగా నడిపించిన దర్శకనిర్మాతల్ని అభినందిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజశేఖర్‌రెడ్డిని నలభై సంవత్సరాలు పాటు ప్రజలు ఆదరించి నాయకుడిగా నిలబెట్టుకున్నారు. ఆయన కూడా తండ్రిగా వారికి ఏం చేయాలో అవన్నీ చేశారు. రాజశేఖర్‌రెడ్డి దూరమైన తర్వాత ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా అక్కున చేర్చుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన వారందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. నటి అశ్రిత మాట్లాడుతూ ఈ సినిమాలో విజయమ్మ పాత్ర పోషించాను. సినిమా చూసిన వారంతా ఆమె మాదిరిగానే ఉన్నానని ప్రశంసిస్తున్నారు. విజయమ్మతో కలిసి సినిమా చూసే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని చెప్పింది. మహి.వి.రాఘవ్, విజయ్ చిల్లా, దిల్మ్రేష్ తదితరులు పాల్గొన్నారు.

1452

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles