ఇద్దరిలో ఎవరు?


Mon,May 21, 2018 12:12 AM

Young hero to play NTR role in a biopic

nithin
బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి క్రిష్ (రాధాకృష్ణ) దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన క్రిష్ మాత్రమే ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్‌కు న్యాయం చేయగలడని భావించడంతో ఆయనకే దర్శకత్వ బాధ్యతల్ని అప్పజెప్పారని బాలకృష్ణ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్‌లో దర్శకుడు క్రిష్ కొన్ని మార్పుల్ని చేయబోతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా యుక్తవయసులోని ఎన్టీఆర్ పాత్రకోసం ఓ యువ హీరోని తీసుకోవాలనే ఆలోచనలో క్రిష్ వున్నారట. ఎన్టీఆర్ యవ్వనంలో సన్నగా వుండేవారు. ఈ పాత్రలో బాలకృష్ణ కనిపించడం సబబుకాదని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో యువ ఎన్టీఆర్ పాత్రకు నితిన్, శర్వానంద్‌లలో ఒకరిని ఎంపిక చేసుకునే ఆలోచనలో క్రిష్ వున్నారని చెబుతున్నారు.

వీరిద్దరిలో ఒకరి పేరును త్వరలో ప్రకటించబోతున్నారని తెలిసింది. ఇదిలావుండగా క్రిష్ ప్రస్తుతం హిందీలో మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కంగనారనౌత్ కథానాయిక. తొలితరం స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీలక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వుంది. ఈ సినిమా విడుదలైన తర్వాతే ఎన్టీఆర్ బయోపిక్‌పై క్రిష్ పూర్తిస్థాయిలో దృష్టిపెడతారని అంటున్నారు. ఈలోగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. దీనికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.
Sharwanand

2250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles