ప్రతీకార నేపథ్యంలో..!


Mon,March 25, 2019 12:15 AM

Yevadu Thakkuva Kadu Movie fst lool Relese

లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎవడు తక్కువ కాదు. ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్స్ అని ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్ర ట్యాగ్ టైన్ సినిమాలోని విక్రమ్ సహిదేవ్ క్యారెక్ట్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇదొక న్యూఏజ్ రివేంజ్ డ్రామా. బాల నటుడిగా ఆకట్టుకున్న విక్రమ్ కథకు తగ్గ వైవిధ్యమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాడు. టీనేజ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. మా సంస్థలో ఇదొక మంచి సినిమాగా నిలుస్తుంది. కథ అద్భుతంగా కుదరడంతో సినిమాపై గట్టి నమ్మకంతో వున్నాం అన్నారు.

723

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles