యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో..


Mon,August 5, 2019 12:49 AM

Yash Raj Films in Shah Rukh Khan

బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు. తదుపరి చిత్రం కోసం విరామం తీసుకుంటానని ప్రకటించిన షారుఖ్‌ఖాన్ తాజాగా బాలీవుడ్ క్రేజీ చిత్రాల నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. వచ్చే ఏడాదిలో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా షారుఖ్‌ఖాన్‌తో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీని ప్రారంభించనున్నట్లు తెలిసింది. యష్‌రాజ్ ఫిల్మ్స్, షారుఖ్‌ఖాన్‌ల కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, రబ్ నే బనాదీ జోడీ సూపర్‌హిట్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే.

524

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles