కేజీఎఫ్ చాప్టర్ 2 మొదలైంది


Wed,March 13, 2019 11:33 PM

Yash begins shooting for KGF Chapter 2

యష్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో పవర్‌ఫుల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 250కోట్లు వసూలు చేసింది. తెలుగులో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. వారాహి చలనచిత్రం పతాకంపై సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్-2 బుధవారం బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్, నాయకానాయికలు యష్, శ్రీనిధిశెట్టి, చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు పాల్గొన్నారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబర్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. 2020 వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కేజీఎఫ్‌లో నటించిన స్టార్లందరూ సీక్వెల్‌లో నటిస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నది.

1512

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles