రజనీకాంత్ పేట్ట


Sat,September 8, 2018 07:37 AM

shankar rajinikanths 20 teaser release date here

సూపర్‌స్టార్ రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొందుతున్న 2.ఓ. చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలా వుండగా రజనీ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేట్ట అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది. శుక్రవారం ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ టీజర్‌లో నల్లని కళ్లజోడు, మెడలో తెల్లని రుమాలు ధరించి చర్చిలోనికి ైస్టెల్‌గా రజనీ నడిచి వస్తున్న తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఇటీవల నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన లుక్‌లో యంగ్‌గా కనిపిస్తున్నారాయన. రజనీ మార్కు మాస్ అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. రజనీకాంత్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


5072

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles