చంద్రబాబు@1984


Wed,September 12, 2018 10:57 PM

Rana Daggubati Plays AP CM Chandrababu Naidu in NTR Biopic

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ విష్ణువర్ధన్ ఇందూరి, సాయికొర్రపాటి, ఎం.ఆర్.వి ప్రసాద్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. వినాయకచవితిని పురస్కరించుకొని చిత్రబృందం ఆయన లుక్‌ను విడుదలచేసింది. తన లుక్‌ను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న రానా 1984లో చంద్రబాబు నాయుడు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నివాసంలో చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రబృందం తెరకెక్కిస్తున్నారు. బుధవారంతో రానా పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నది. ఎన్టీఆర్ సినీ ప్రయాణంతో పాటు రాజకీయ, వ్యక్తిగత జీవితాన్ని ఈ బయోపిక్‌లో ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకుతీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోను ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

4376

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles