మనుషులు జాగ్రత్త


Sun,September 9, 2018 11:16 PM

Rajinikanth Akshay Kumar starrer 2.0 Teaser to be Out on September 13

రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 2.ఓ. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమీ జాక్సన్ కథానాయిక. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, తెలుగుతో పాటు మరో పన్నెండు భారతీయ, విదేశీ భాషల్లో విడుదలచేయబోతున్నారు. ఆదివారం అక్షయ్‌కుమార్ జన్మదినం. ఈ సందర్భంగా సినిమాలోని తన లుక్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారాయన. చింతనిప్పుల్లాంటి కళ్లు, పక్షి ఈకలను పోలిన సూదుల్లాంటి పొడవైన వెంట్రుకలు, గోళ్లతో కూడిన ఈ లుక్‌లో కొత్త పంథాలో కనిపిస్తున్నారాయన. నా కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర ఇది. నోరులేని జీవాలకు అండగా నిలిచే సూపర్‌హీరోగా నా పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. మనుషులు జాగ్రత్త అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు అక్షయ్‌కుమార్. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదలచేయబోతున్నారు. నవంబర్ 29న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

3886

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles