తొలి మహిళా పైలెట్..


Wed,September 5, 2018 11:09 PM

Jhanvi Kapoor Sridevi daughter Janhvi Kapoor thanks Madhuri Dixit

ధడక్ సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైంది శ్రీదేవి తనయురాలు జాన్వీకపూర్. తొలి సినిమాలో అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్న ఆమె బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని దక్కించుకుంటున్నది. తాజాగా జాన్వీకపూర్ ఓ బయోపిక్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్) విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా దర్శకనిర్మాత కరణ్‌జోహర్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో గాయపడిన భారతీయ సైనికులను మరో మహిళా పైలెట్ శ్రీవిద్య రంజన్‌తో కలిసి గుంజన్ సక్సేనా ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మహిళా పైలెట్ సాహసోపేత గాథను ఆవిష్కరిస్తూ రూపొందనున్న సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ నటించనున్నట్లు సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం ఇటీవలే గుంజన్‌ను, జాన్వీ కలిసినట్లుగా తెలిసింది. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

3413

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles