నిశ్చితార్థం క్యాన్సిల్?


Sun,September 9, 2018 11:30 PM

Geetha Govindam actress Rashmika Mandanna breaks up with fiance Rakshit Shetty

కన్నడ హీరో రక్షిత్‌శెట్టితో యువ నాయిక రష్మిక మందన్న నిశ్చితార్థం రద్దయిందనే వార్తలు మరోమారు కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కిరిక్‌పార్టీ చిత్ర సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. అనంతరం నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికోసం వేచిచూస్తున్నారు. ఈలోగా తెలుగులో ఛలో గీత గోవిందం చిత్రాల వరుస విజయాలతో రష్మిక బిజీగా మారింది. కెరీర్‌పైనే దృష్టిపెట్టాలని నిర్ణయించుకోవడంతో ఆమె నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉందని వార్తలొచ్చాయి. అయితే వాటిని రష్మిక ఖండించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఈ జంట నిశ్చితార్థం రద్దయినట్లు సమాచారం. రష్మిక మందన్న సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరించారని సదరు పత్రిక పేర్కొంది. మనస్పర్థల వల్ల వారిద్దరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో దేవ్‌దాస్ చిత్రంలో నటిస్తున్నది.

9038

More News

VIRAL NEWS

Featured Articles