ఢీ గ్లామర్ పాత్రలో...


Thu,November 10, 2016 11:38 PM

Deepika Padukone can do glamorous roles,

tumblr_mkfn
కథాంశాలు, పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి ముందుంటుంది దీపికాపదుకునే. ట్రిపులెక్స్, ది రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోన్న ఆమె తాజాగా మరో విలక్షణ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, ది కలర్ ఆఫ్ పారడైజ్, మొహమూద్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు ఇరాన్ దర్శకుడు మజిద్ మజీదీ .మానవ సంబంధాలు, వాటి తాలూకూ సంఘర్షణకు పెద్దపీట వేస్తూ సినిమాల్ని తెరకెక్కించే ఆయన దోభీ యువతి జీవితం ఆధారంగా మురికివాడల నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది. దోభీ కార్మికురాలిగా ఢీ గ్లామర్ పాత్రలో దీపికా కనిపించనుంది. మానవీయ విలువలతో సాగే ఈ చిత్రంలో సామాన్య యువతిగా ఆమె పాత్ర వైవిధ్యంగా సాగుతుందని సమాచారం. దీపికాపదుకునే పాత్రలో భిన్నపార్శాలుంటాయని, ఆమె కెరీర్‌లో ప్రత్యేక చిత్రమవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ, రాజస్థాన్, కశ్మీర్‌లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీపికాపదుకునే సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి చిత్రంలో నటిస్తోంది.

1009

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles