సైరా మొదలైంది


Wed,December 6, 2017 11:34 PM

Chiranjeevis Sye Raa Narasimha Reddy starts shooting

ram-charan-tej
ఖైదీనంబర్ 150 తర్వాత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టారు చిరంజీవి.సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మొదలుపెట్టారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఫైట్‌మాస్టర్ లీ విట్టేకర్ సారథ్యంలో చిరంజీవిపై కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 22న వరకు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర బృందం పేర్కొన్నారు. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. సినిమాకు మంచి టీమ్ కుదిరిందని, అందరి కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముందని రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

1030

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles