చిలుకూరు బాలాజీ మహిమలు


Fri,April 24, 2015 11:11 PM

chilukuru balaji mahimalu

sai


అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఈటీవి, ఫిల్మీడియా పతాకంపై వీసాల స్వామిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ ఆలయం ఎలా వెలసింది అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రం చిలుకూరు బాలాజీ. సాయికుమార్, సుమన్, సునీల్‌శర్మ, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం నరసింహాస్వామి మహిమలను తెలియజేస్తూ ఓ పాటని చిత్రీకరించబోతున్నాం. ఈ పాటను ప్రముఖ రచయిత జె.కె.భారవి రచించారు.

చిలుకూరు పుణ్య క్షేత్రంతో పాటు యాదగిరి క్షేత్రంలోనూ చిత్రీకరించనున్నాం. ఇటీవలే సీజీ వర్క్ పూర్తయింది. త్వరలో ఆడియో విడుదల చేయనున్నాం. ఈటీవి వారు విదేశాల్లో నిర్వహించిన పాడుతాతీయగా కార్యక్రమ ప్రారంభంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రదర్శించడం వల్ల విదేశాల్లో సైతం మా చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా వుంటుంది. సాయికుమార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రలు సినిమాకు మూలస్థంభాల్లాంటివి. శ్రీవెంకటేశ్వరస్వామి మహిమల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందన్న నమ్మకముంది అన్నారు.

2370

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles