అశ్వమేధ యాగం


Thu,September 6, 2018 11:49 PM

Aswamedham Movie Song Launch

ధృవకుమార్, శివంగి, సోనియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అశ్వమేధం. నితిన్. జి దర్శకుడు. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గజానన.. అంటూ సాగే గీతాన్ని ఐశ్వర్య యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రచయిత జగదీష్ మెట్ల మాట్లాడుతూ ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకం. ఇదొక స్పై థ్రిల్లర్. వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. నిర్మాతలలో ఒకరైన ప్రియానాయర్ ఈ కథ కావాలని రాయించుకున్నారు. టీమ్ అంతా చాలా ఉత్సాహంగా చేశాం అన్నారు. నాలుగేళ్ల విరామం తరువాత నేను సంగీతం అందించిన చిత్రమిది. చిన్నిచరణ్‌గా సుపరిచితుడినైన నేను ఈ సినిమాతో చరణ్ అర్జున్‌గా మీ ముందుకు వస్తున్నాను. వినాయకుడిపైన చాలా మంది సంగీత దర్శకులు అద్భుతమైన పాటలిచ్చారు.

ఈ పాటతో వారి సరసన నిలవాలనే ఆశతో సంగీతం అందించాను అని చరణ్ అర్జున్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ గజానన..పాటను తెరపై చూసుకున్నప్పుడు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. గణేష్ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించాం. తెలుగు ప్రేక్షకులు నిజాయితీగా వుంటారు. సినిమా బాగుంటే ఆదరిస్తారు. మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. తెలుగులో ఇది మా తొలి చిత్రం. తప్పకుండా ఆదరించి తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు.

906

More News

VIRAL NEWS