అంతర్జాతీయ ప్రమాణాలతో


Fri,June 23, 2017 11:08 PM

Allani Sridhar Komaram Bheem 112th birthday on 18th

AllaniSridhar
కొమురం భీమ్, గౌతమబుద్ధ, తుహీ మేరీ గంగ, ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నారు దర్శకుడు అల్లాణి శ్రీధర్. నేడు ఆయన జన్మదినం. ప్రస్తుతం భక్తిరస ప్రధాన కథాంశంతో శ్రీ చిలుకూరు బాలాజీ చిత్రాన్ని తెరకెక్కిస్తురాయన. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ మా ఫిల్మీడియా సంస్థ ద్వారా ఎంతో మంది యువ దర్శకనిర్మాతలకు మార్గదర్శిగా నిలవడం ఆనందంగా ఉంది. చిలుకూరు క్షేత్ర మహిమలతో స్వీయ దర్శకత్వంలో నేను రూపొందించిన శ్రీ చిలుకూరు బాలాజీ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయికుమార్, భానుశ్రీమెహ్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ముఖ్య పాత్రలను పోషించారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర గీతాలకు దేశవిదేశాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది. అంతర్జాతీయ విలువలతో స్వీయ దర్శకత్వంలో త్వరలో ఓ బాలల చిత్రాన్ని నిర్మించనున్నాను. నవంబర్‌లో జరగనున్న బాలల చలనచిత్రోత్సవాల్లో దీనిని ప్రదర్శించనున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఆయుత చండీయాగం, నాయకుడొక్కడే, రైతేరాజు లఘు చిత్రాలను రూపొందించాను అని తెలిపారు.

1374

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles