మహర్షి ఔన్నత్యం

Thu,February 7, 2019 11:55 PM

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ ప్రసాద్ నిర్మాతలు. పూజాహేగ్డే కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. మరోవైపు ఈ చిత్ర నిర్మాణానంతర పనుల్లో భాగంగా గురువారం డబ్బింగ్ కార్యక్రమాల్ని ఆరంభించారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా, రైతుగా భిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇటీవలే పొల్లాచ్చిలో మహేష్‌బాబు వ్యవసాయం చేస్తున్న కొన్ని కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. ద్వితీయార్థంలో వచ్చే ఎపిసోడ్‌లో ఆయన రైతు పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. స్నేహం, కుటుంబ అనుబంధాల ఔన్నత్యాన్ని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

3140

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles