ఫలక్‌నుమా దాస్-2తో..


Fri,June 7, 2019 11:24 PM

Will shock everyone with Falaknuma Das 2 movie soon Vishwak Sen

హైదరాబాద్‌లోని 118లొకేషన్లలో మా చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం విశ్వక్‌సేన్ దాదాపు రెండు సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. 7రోజుల్లో 7కోట్ల 50లక్షలు వసూలు చేసింది అన్నారు కరాటే రాజు. ఆయన నిర్మించిన చిత్రం ఫలక్‌నుమా దాస్. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందించారు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ సెకండాఫ్ కొంచెం నిడివి ఎక్కువైందంటున్నారు. అందుకే కొంత ఎడిట్ చేశాం. నేటి నుంచి ఇది అమలవుతుంది.

సినిమాకు 50థియేటర్లు పెరుగుతున్నాయి. త్వరలో భారీ తారాగణంతో ఫలక్‌నుమా దాస్-2 ద్వారా మీ ముందుకొస్తాం అన్నారు. అన్ని అవాంతరాల్ని అధిగమించి సినిమా అద్భుతమైన ఆదరణ పొందుతున్నది. ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. ఫలక్‌నుమా దాస్‌తో ధమ్కీ ఇచ్చాను. నా తర్వాతి సినిమాతో షాక్ ఇస్తా అని కథానాయకుడు విశ్వక్‌సేన్ చెప్పారు. శివ, చందమామ సినిమాల తర్వాత తనకు ఈ సినిమాలో అంతటి గుర్తింపు తెచ్చిన పాత్ర దొరికిందని ఉత్తేజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి, జీవన్, యశ్వంత్, సంజయ్‌టోనీ, కౌశిక్, కార్తీక్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

1309

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles