అసూయాద్వేషాలతో


Sun,July 21, 2019 11:59 PM

Wife i first look Abhishek Reddy and Sakshi Nidiya play husband and wife

అభిషేక్‌రెడ్డి, సాక్షి నిదియా జంటగా నటిస్తున్న చిత్రం వైఫ్ ఐ. నైఫ్ బెటర్ దెన్ వైఫ్ ఉపశీర్షిక. జి. ఎస్.ఎస్.పి కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.చరితారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ సమకాలీన సమాజంలో జరుగుతున్న ఓ మంచి పాయింట్‌కు వినోదాన్ని మేళవించి ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని ప్రారంభిస్తాం అని తెలిపారు. నేటి సమాజంలో భార్యభర్తల మధ్య ప్రేమ స్థానంలో అసూయద్వేషాలు పెరిగిపోవడానికి కారణమేమిటనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రమిదని, తాము చేసిన తప్పులను ఓ జంట ఎలా సరిదిద్దుకున్నది అనేది ఆసక్తిని పంచుతుందని నిర్మాత పేర్కొన్నారు.

301

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles