తొలి సినిమా చాలా నేర్పింది!


Tue,March 12, 2019 11:52 PM

Where Is the Venkatlakshmi released on March 15

ఆద్యంతం నవ్వులను పంచే వినోదభరిత కథాంశమిది. హారర్, రొమాన్స్, భావోద్వేగాల సమ్మిళితంగా సాగుతూ ఆహ్లాదాన్ని పంచుతుంది అని అన్నారు ఎం. శ్రీధర్‌రెడ్డి. హెచ్ ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డిలతో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రాయ్‌లక్ష్మీ, పూజిత పొన్నాడ, రామ్‌కార్తిక్, ప్రవీణ్, మధునందన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. కిషోర్‌కుమార్ దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో శ్రీధర్‌రెడ్డి పాత్రికేయులతో ముచ్చటిస్తూ దిల్‌రాజు స్ఫూర్తితో నిర్మాతగా మారాను. కథలను ఎంచుకునే విధానం, అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ దిల్‌రాజు సినిమాల్ని పూర్తిచేసే తీరు నాలో ఆసక్తిని కలిగించింది. తొలుత పంపిణీదారుడిగా కొన్ని సినిమాలకు పనిచేశాను. ఆ తర్వాత చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తితో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రాన్ని నిర్మించాను.

పూరి జగన్నాథ్‌కు సహాయకుడిగా పనిచేసిన కిరణ్ కుటుంబ విలువలు, హారర్ హంగులతో చక్కటి కథను సిద్ధంచేశారు. దర్శకుడు కిషోర్‌కు ఇదే తొలి సినిమా అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా తెరకెక్కించారు. వెంకటలక్ష్మి ఎవరు? పండు, చంటి అనే పల్లెటూరి యువకుల్లో ఆమె ఎందుకు పరివర్తన తీసుకొచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రవీణ్, మధునందన్ కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. నటిగా లక్ష్మీరాయ్‌ని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. నిర్మాతగా ఇదే తొలి సినిమా కావడం, అనుభవలేమి కారణంగా బడ్జెట్ పెరిగింది. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. తదుపరి సినిమా కోసం నాలుగైదు కథలు విన్నాను అని తెలిపారు.

509

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles