వెంకటలక్ష్మి దాచిన నిజం


Sat,March 9, 2019 11:56 PM

Where is The Venkatalakshmi release on 15 March

రాయ్‌లక్ష్మీ, రామ్‌కార్తిక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. కిషోర్‌కుమార్ దర్శకుడు. ఎం. శ్రీధర్‌రెడ్డి, హెచ్.ఆనంద్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ చంటిగాడు, పండుగాడు పాత్రల్లో కీలకంగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా మధునందన్ మాట్లాడుతూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ముగింపు మాత్రం ఉత్కంఠభరితంగా ఉంటుంది. వెంకటలక్ష్మి అనే ఓ అందాలభామను చంటిగాడు, పండుగాడు ప్రేమిస్తారు. అయితే తమ ప్రేమను వ్యక్తపరిచేలోపే వారికి వెంకటలక్ష్మి గురించి ఓ నిజం తెలుస్తుంది. అదేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషిస్తున్న పండుగాడు పాత్ర చక్కటి హాస్యంతో గిలిగింతలు పెడుతుంది. దర్శకుడు ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు అన్నారు. ప్రస్తుతం హాస్యనటుల అవకాశాల గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న పోటీలో ఓ హాస్యనటుడు పదేళ్లపాటు రాణించడం మామూలు విషయం కాదు. గతంలో వినోదానికి సినిమా తప్ప మరో మాధ్యమం లేదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సోషల్‌మీడియాతో పాటు అనేక వేదికలు వచ్చాయి. ఎందరో ఔత్సాహికులు తెరమీదకు వస్తున్నారు. అయితే ప్రతిభ ఉన్నవారు ఎక్కడైనా రాణిస్తారు. చక్కటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. నటుడిగా కోట శ్రీనివాసరావు నాకు స్ఫూర్తి. ప్రస్తుతం అక్షర, షాజహాన్ చిత్రాల్లో నటిస్తున్నాను అన్నారు.

1188

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles