ఆ సంగతి తర్వాత..

Thu,February 7, 2019 11:35 PM

కథానాయికలు తమ ప్రేమ వ్యవహారాల గురించి మీడియా ముందు స్పందించడానికి నిరాకరిస్తారు. ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేసే ధోరణిని ప్రదర్శిస్తారు. అయితే బాలీవుడ్ నాయిక అలియాభట్ మాత్రం తన ప్రేమ, పెళ్లిపై స్పష్టత నిచ్చింది. పెళ్లి గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చింది. వివరాల్లోకి వెళితే...అగ్రహీరో రణభీర్‌కపూర్, అలియాభట్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ వ్యవహారం గురించి వీరిద్దరూ ఏనాడు బహిరంగంగా స్పందించలేదు. త్వరలో ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు బాలీవుడ్ చిత్రసీమలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మంబయిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అలియాభట్‌ను ఓ విలేకరి మీ పెళ్లెప్పుడని ప్రశ్నించారు. అందుకు ఆమె ప్రియాంకచోప్రా, దీపికాపదుకునే వివాహా వేడుకలు ఘనంగా జరిగాయి. మనందరం ఆ ఉత్సవాల్ని ఆస్వాదించాం. నా పెళ్లికి మరికొంత సమయం ఇవ్వండి. ప్రస్తుతం నేను వృత్తిపరమైన పనులతో బిజీగా ఉన్నాను. నా పెళ్లి విషయంలో మీ అందరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ రణభీర్‌తో పెళ్లి విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. ప్రస్తుతం రణభీర్‌కపూర్, అలియాభట్ కలిసి బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. అయాన్‌ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.

2136

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles