నిర్మాతగా రామానాయుడు స్ఫూర్తి!


Wed,May 8, 2019 11:37 PM

We are confident about the success of the film producer G Seethareddy

డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. బంధాలు బంధుత్వాలు అన్నీ ఇప్పుడు డబ్బు మయమే. అలాంటి డబ్బును సంపాదించే దారి మంచిదైతే ఎలా వుంటుంది?. ఆ మార్గం చెడైతే తలెత్తే పరిణమాలేంటి అన్నదే మా చిత్ర ప్రధాన ఇతివృత్తం అన్నారు నిర్మాత జి. సీతారెడ్డి. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ఎంత వారలైనా. అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్‌జైన్, సీతారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురు చిందేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత జి.సీతారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను భవన నిర్మాణ రంగం నుంచి వచ్చాను. చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. దొంగతనంగా సినిమాలు చూసిన రోజులున్నాయి. వ్యాపారంలో బిజీగా వుండటం వల్ల సినిమాలపై దృష్టిపెట్టలేకపోయాను. ఈ చిత్ర దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌మేట్. చాలా రోజుల తరువాత 2016లో ఇద్దరం కలిశాం.

ఆ సమయంలో ఈ చిత్ర కథ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడికి సహాయం చేసినట్టుగా వుంటుంది. ఎప్పటి నుంచో సినిమాల్లోకి రావాలన్న నా కోరిక నెరవేరుతుందని ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాను. ఈ చిత్రంలో ఎస్పీ పాత్ర కోసం నేను అయితే బాగుంటుందని నాతో నటింపజేశారు. నాకు నటన రాదు. దాంతో కొన్ని రోజులు కెమెరాను అలవాటు చేశారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. కథే హీరో. కమల్‌హాసన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల తరహాలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకునే చిత్రమిది. కథ, పాత్రల చిత్రణ, పాటలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నా స్నేహితుడిపై వున్న నమ్మకంతో చేసిన సినిమా ఇది. సాంకేతికంగా ఉన్నతంగా వుండే చిత్రమిది. సుక్కు అందించిన స్వరాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన నిర్మాత రామానాయుడు. నిర్మాతగా నాకు ఆయనే స్ఫూర్తి. సినిమా ఎలా తీయాలో ఆయన నుంచే నేర్చుకున్నాను. సినిమా ఫలితం ఎలా వున్నా నటుడిగా, నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను అన్నారు.

701

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles