లవ్ యాక్షన్ డ్రామా


Mon,July 8, 2019 12:04 AM

Watch SIIMA 2016 Best Actress Malayalam Goes to Nayanthara

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా చిత్రాల్ని అంగీకరిస్తూ జోరుమీదున్న నయనతార మాతృభాష మలయాళంలో మాత్రం విరామం తీసుకుంటూ నటిస్తున్నది. 2016లో పుథియనియమం తర్వాత మలయాళ సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మూడేళ్ల తర్వాత లవ్ యాక్షన్ డ్రామాతో మాలీవుడ్‌లో పునరాగమనం చేస్తున్నది. నివిన్ పాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఎరుపురంగు షర్ట్ ధరించి కాఫీ కప్పుతో నయనతార చిరునవ్వులు చిందిస్తుండగా.. మద్యం గ్లాస్‌తో నివిన్ పాల్ కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆధునిక వస్త్రధారణలో కనిపిస్తున్న నయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. శోభ అనే పాలక్కడ్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ యువతిగా నయనతార కనిపించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. భార్య తనను హతమార్చుతుందనే మానసిక వ్యాకులతతో బాధపడే ఓ భర్త కథతో ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా సాగనున్నట్లు తెలిసింది.

765

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles