ఆత్మీయతను పంచుతున్నారు!

Tue,February 5, 2019 11:32 PM

మనం సైతం స్వచ్ఛంద సేవా సంస్థ వరుసగా సేవా కార్యక్రమాల్ని చేపడుతూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నది. నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆశ్రితులకు సహాయసహకారాల్ని అందిస్తూ మానవతను చాటుకుంటున్నది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరిలో విద్య, వైద్యం, క్రీడలు వంటి వివిధ అవసరాలు కలిగిన వారున్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ నేను జీవితంలో ఎదుర్కొన్న బాధలు, కోపం, ప్రతీకారం, ఆవేదనకు మరో కోణంలో మొదలైందే మనం సైతం. మేము అందిస్తున్న సహాయానికి ఎన్నో రెట్లు దీవెనలు లభిస్తున్నాయి. ఏడుగురితో మొదలైన మనం సైతం ఈరోజు లక్షా 70వేల మంది సభ్యులను సంపాదించుకుంది అన్నారు.

ఎఫ్‌డీసీ ఛైర్మన్ పి.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ పేదలకు డబ్బుతో పాటు ఆత్మీయతను పంచుతున్నారు. చిత్ర పరిశ్రమలోని కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదు. అలాంటి కార్మికులకు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి సగం ఖర్చు మినహాయింపుతో ఆరోగ్య భీమా అందజేస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే చిత్రపురి కాలనీలో ఒక వైద్యశాల నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. నేటి సమాజంలో మనం సైతం వంటి సంస్థల అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి సతీమణి శ్వేతా లకా్ష్మరెడ్డి చెప్పారు.

488

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles