గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా!


Tue,January 10, 2017 11:59 PM

చిరంజీవి సినిమా చూసి బాగుందని చెప్పడంతో టెన్షన్ మొత్తం దూరమైంది. విడుదలకు ముందే సూపర్‌హిట్‌ను అందుకున్న భావన కలుగుతుంది అని అన్నారు వి.వి.వినాయక్. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 వి.వి.వినాయక్ దర్శకుడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో వినాయక్ ముచ్చటించిన విశేషాలివి..
VV-Vinayak

రైతు నాయకుడిగా


చిరంజీవి ఇమేజ్, శైలికి సరిపోయే అంశాలతో సినిమాను తీర్చిదిద్దాం. మాతృకతో పోలిస్తే కథలో పెద్దగా మార్పులు చేయలేదు. రైతుల కోసం పోరాడే నాయకుడిగా చిరంజీవి పాత్ర ప్రభావవంతంగా సాగుతుంది. రెండు భిన్న పార్వ్శాల్లో వైవిధ్యంగా ఆయన కనిపిస్తారు.

అనుష్కను అనుకున్నాం


చిరంజీవికి జోడీగా అనుష్క, కాజల్ అగర్వాల్‌లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నాం. బాహుబలి, ఓం నమో వేంకటేశాయ సినిమాలతో బిజీగా ఉండటంతో అనుష్క డేట్స్ సర్దుబాటు కాలేదు. దాంతో కాజల్‌ను తీసుకున్నాం. హీరో లక్ష్యసాధనలో తోడ్పాటునందించే యువతిగా కాజల్ కనిపిస్తుంది.

నిరాశ పడ్డాను


ఓ సినిమా పరాజయ ప్రభావం తప్ప కుండా దర్శకులపై ఉంటుంది. అఖిల్ సినిమాతో కొంత నిరాశలో మునిగిపోయాను. కానీ ఆ డిఫ్రెషన్ నుండి చిరంజీవి నన్ను బయటపడేలాచేశారు. కత్తి కథ అనుకోగానే దర్శకుడిగా నా పేరే గుర్తొచ్చిందని చిరంజీవి అనడం గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. చరణ్ సినిమాలో ఓ పాటలో కనిపిస్తారు.

నిడివి ఎక్కువ కావడంతోనే


చిత్ర నిడివి ఎక్కువ కావడంతో పృథ్వీ నటించిన సన్నివేశాల్ని తొలగించాం. ఆ విషయాన్ని ఆయనకు ఫోన్‌చేసి చెప్పాను. కానీసినిమాలో నుంచి తనను తొలగించిడం తల్లి చనిపోయినంత అవేదనగా ఉందని అన్నారు. ఆయన మాటలు చిరంజీవితో పాటు నన్ను బాధించాయి. అందరం సంతోషంగా ఉండే సమయంలో అతడిని బాధపెట్టడం ఇష్టంలేక పృథ్వీ నటించిన సన్నివేశాల్ని యధాతథంగా సినిమాలో ఉంచాం.

3359
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS