నరేంద్ర మోదీ బయోపిక్‌లో..


Fri,January 4, 2019 11:51 PM

vivek oberoi to star in pm modis biopic titled pm narendra modi

ప్రస్తుతం జీవిత కథల ట్రెండు నడుస్తోంది. విజేతల గాథల్ని వెండితెరపై దృశ్యమానం చేస్తుండటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నది. దీంతో దర్శకనిర్మాతలు ఈ తరహా సినిమాలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఈ కోవలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా త్వరలో హిందీలో తెరపైకి రాబోతోంది. ఈ చిత్రానికి పీఎం నరేంద్రమోదీ అనే పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ శుక్రవారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేరీకోమ్, సరబ్‌జిత్ వంటి బయోపిక్‌లని ఒమంగ్‌కుమార్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 7న విడుదల చేయనున్నారు. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

950

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles