దేశభక్తి నా శక్తి

Mon,January 7, 2019 11:11 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. పీఎం నరేంద్రమోదీ అనే టైటిల్‌తో 23 భారతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో మోదీ పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించబోతున్నారు. ఒమంగ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఫస్ట్‌లుక్‌ను సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదలచేశారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ అచ్చు మోదీ రూపురేఖలతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న వివేక్ ఒబెరాయ్ అద్భుతమైన ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలి అని పేర్కొన్నారు. దేశభక్తే నా శక్తి అనే క్యాప్షన్‌ను పోస్టర్‌లో జోడించారు. మోదీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

2295

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles