విశ్వామిత్ర ఎవరు?


Sun,April 14, 2019 11:30 PM

viswamitra to release in may

అంతా తన వాళ్లే అనుకునే ఓ అమ్మాయి జీవితంలో ఆమె సమస్యలకి ఓ ఆజ్ఞాత వ్యక్తి పరిష్కారం చూపిస్తుంటాడు. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు?. అతనికి, ఆ యువతికి వున్న సంబంధం ఏమిటన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అన్నారు రాజకిరణ్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విశ్వామిత్ర. నందితారాజ్, సత్యం రాజేష్ జంటగా నటిస్తున్నారు. రాజకిరణ్ సినిమాస్ పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్‌తో కలిసి రాజకిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ విశ్వంలో మానవుడి మేథస్సుకు అందని విషయాలు ఎన్నో వున్నాయి. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. ఎప్పటికీ నిలిచి వుండే ఈ సృష్టిలో మనుషులు కొంత కాలమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా గీతాంజలి, త్రిపుర చిత్రాల తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. మేలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్‌చంద్ర, జీవా తదితరులు నటిస్తున్నారు.

1131

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles