విశ్వామిత్ర రహస్యం


Wed,May 22, 2019 11:28 PM

vishwamitra set to release the movie on june 14

నందితారాజ్, సత్యం రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం విశ్వామిత్ర. రాజకిరణ్ దర్శకుడు. సెన్సార్ పూర్తయింది. చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ మధ్య తరగతి అమ్మాయి జీవితం సంతోషంగా సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఆమెను సమస్యలు చుట్టుముడుతాయి. వాటి నుంచి ఆ యువతిని ఓ అజ్ఞాత వ్యక్తి కాపాడతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు?. విశ్వామిత్ర ఎవరు? అతని వెనకున్న రహస్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సెన్సార్ పూర్తయింది అన్నారు

746

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles