విశాల్‌ యాక్షన్‌

Sat,September 14, 2019 12:30 AM

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘యాక్షన్‌'. సుందర్‌.సి దర్శకుడు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌.రవీంద్రన్‌ నిర్మించారు. తమన్నా కథానాయిక. శుక్రవారం చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది. విదేశీ నేపథ్యంలో ైస్టెలిష్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, ఛేజింగ్‌ సన్నివేశాలతో టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అండర్‌కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా విశాల్‌ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను టర్కీలో మూడు నెలల పాటు శ్రమించి తెరకెక్కించాం. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పోరాటఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. దీ పావళి పర్వదినం కానుకగా ఈ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. తమన్నా గ్లామర్‌తో పాటు అభినయం ఆకట్టుకుంటుంది. విజువల్‌గా సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ:డిడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌.

360

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles