తస్సదియ్యా రామయ్య


Fri,December 14, 2018 11:58 PM

Vinaya Vidheya Rama Second Single Thassadiyya Releasing on Dec 17th

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. కైరా అద్వాణీ కథానాయిక. టాకీ పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన తాజా షెడ్యూల్‌లో ఈ గీతాలను చిత్రీకరిస్తాం. ఈ నెల 26తో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. సినిమాలోని ప్రత్యేక గీతాన్ని బాలీవుడ్ నటి ఈషా గుప్తాపై చిత్రీకరిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన తందానే పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది.

తస్సదియ్యా.. అనే గీతాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అభిమానుల అంచనాలకు మించి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. కుటుంబ క్షేమం కోసం యుద్ధం చేసిన ఓ రాముడి కథ ఇది. రామ్‌చరణ్ అభిమానులకు కనులవిందుగా ఉంటుంది అని పేర్కొన్నారు. వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, అర్థర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: ఎం. రత్నం.

3385

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles