అపరిచితుడు తరువాత..


Thu,September 20, 2018 11:48 PM

Vikram next is a remake of Dont Breathe

విక్రమ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం సామి స్కేర్. హరి దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ సామి పేరుతో తెలుగులో అందిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల మా చిత్రంపై ఎన్నో రూమర్‌లు వచ్చాయి. సెన్సార్ కాదని, విడుదల కూడా చేయలేరని కొంత మంది పుకార్లు సృష్టించారు. వాటన్నింటికీ చెక్ పెడుతూ మా చిత్రాన్ని నేడు విడుదల చేస్తున్నాం. సెన్సార్ సభ్యుల అభినందనలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అత్యధిక థీయేటర్‌లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు హరి. ఆయన సినిమాలు ఎంత స్పీడుగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసిన హీరో విక్రమ్ తన కెరీర్‌లో అపరిచితుడు తరువాత ఆ స్థాయి భారీ విజయాన్ని అందించారని, ఇది తనకు మైలురాయి లాంటి సినిమా అని దర్శకుడు హరిని హగ్ చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారట. అది తెలిసి చాలా సంతోషించాం. సినిమాపై మంచి రిపోర్ట్స్ వచ్చాయి. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగులోనూ భారీ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

1749

More News

VIRAL NEWS

Featured Articles