కురుక్షేత్రంలో విక్రమ్


Mon,February 11, 2019 12:00 AM

Vikram Mahavir Karna Shooting In hyderabad

దక్షిణాది చిత్రసీమలో ప్రయోగాలు చేయడంలో ముందువరుసలో ఉంటారు హీరో విక్రమ్. తాజాగా ఆయన పౌరాణిక ఇతిహాస కథాంశంతో మహావీర్‌కర్ణ అనే సినిమా చేస్తున్నారు. కర్ణుడి దృక్కోణంలో మహాభారత కథను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్.విమల్ దర్శకుడు. దాదాపు మూడు వందల కోట్ల వ్యయంతో తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు విమల్ తెలిపారు. ముప్ఫై నిమిషాల నిడివితో సినిమాలో కనిపించే వార్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుందని ఆయన చెప్పారు. యుద్ధక్షేత్రంలో కర్ణుడి అగమనం, అపరపరాక్రమవంతుడిగా కురుక్షేత్ర రణరంగంలో అతడు సాగించిన పోరాటం తాలూకు సన్నివేశాల్ని విక్రమ్‌పై ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాం దాదాపు 18 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది అని విమల్ తెలిపారు. ఈ చిత్రానికి పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
Vikram1

1198

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles