సేతుపతి యాక్షన్ సేతుపతి యాక్షన్

Tue,November 5, 2019 12:05 AM

విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో నిర్మిస్తున్న చిత్రం సంగతమిళ్ తెలుగులో విజయసేతుపతి పేరుతో విడుదలకానుంది. రెండు భాషల్లో ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్ అంశాలున్న చిత్రమిది. విజయ్‌సేతుపతి పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. పోరాటఘట్టాలు రొమాంచితంగా సాగుతాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలుంటాయి అని చెప్పారు. నివేథా పేతురాజ్, నాజర్, అశుతోష్‌రాణా, రవికిషన్‌శుక్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్, సంగీతం: వివేక్-మెర్విన్, సంభాషణలు: మల్లూరి వెంకట్, దర్శకత్వం: విజయచందర్.

345

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles