విలన్‌గా విజయ్‌సేతుపతి?

Tue,October 1, 2019 12:03 AM

హీరోగా కెరీర్ బిజీగా ఉన్న తరుణంలో సహాయ పాత్రల్లో నటించడానికి చాలా మంది సుముఖత చూపరు. కానీ తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. తమిళంలో అగ్రహీరోల్లో ఒకరిగా చెలామణి అవుతూనే మరోవైపు విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారాయన. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అతడి పాత్ర ఏమిటన్నది మాత్రం వెల్లడించడేలేదు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్‌పైకిరానున్నది. మాళవికా మోహనన్ కథానాయికగా నటించనున్నది.

351

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles