కల కోసం అన్వేషణ


Tue,May 15, 2018 11:03 PM

Kaasi
విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా తమిళ చిత్రం కాళి తెలుగులో కాశి పేరుతో విడుదలకానుంది. కృతిక ఉదయనిధి దర్శకురాలు. అంజలి, సునైన కథానాయికలు. లెజెండ్ సినిమా పతాకంపై హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రద్యుమ్న చంద్రపాటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఒక స్వప్నాన్ని అనుసరిస్తూ అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? కలలోని సంఘటనలు వాస్తవ జీవితంలో ఎదురైనప్పుడు అతను ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ కథ పరిభ్రమిస్తుంది. ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగుతుంది.

తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిదని దర్శకురాలు చెప్పింది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని పాత్ర చిత్రణ నాలుగు భిన్న కోణాల్లో సాగుతుందని రచయిత భాషాశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాకేష్, పృథ్వీ, గాల్విన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్, కథ, దర్శకత్వం: కృతిక ఉదయనిధి.

1043

More News

VIRAL NEWS