ప్రేమకోసం రణం

Sat,March 9, 2019 02:08 AM

ప్రేమంటే సేనలు మోహరించని సంగ్రామం. వలపు గెలుపు తీరాలకు చేరాలంటే సమరానికి సిద్ధంగా ఉండాల్సిందే. ప్రణయరణంలో అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. అలాంటి ధీశాలి అయిన ఓ యువకుడి కథేమిటో తెలుసుకోవాలంటే మా డియర్ కామ్రేడ్ సినిమా చూడాల్సిందే అంటున్నారు భరత్ కమ్మ. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ఉపశీర్షిక. మైత్రీమూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రమిది.

సామాజిక బాధ్యత కలిగి ఎలాంటి అన్యాయాన్ని సహించని ధీరోదాత్తుడైన యువకుడిగా విజయ్‌దేవరకొండ పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుంది అని చిత్రబృందం పేర్కొంది. గీత గోవిందం తర్వాత విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రానికి మాటలు: జె.కృష్ణ, ఆర్ట్: రామాంజనేయులు, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ.

1570

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles