ఫ్రాన్స్‌లో హంగామా


Tue,June 4, 2019 12:13 AM

Vijay Deverakonda Kranthi Madhav  Film Shooting In France

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. కథానుగుణంగా ఫ్రాన్స్‌లో సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. కుటుంబ అనుబంధాలు, వినోదం ప్రధానంగా సాగుతుంది. విజయ్ దేవరకొండ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, ఇజాబెల్లెదె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జేకే, సంగీతం: గోపీసుందర్, రచన-దర్శకత్వం: క్రాంతిమాధవ్.

1277

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles