ప్రపంచ ప్రేమికుడి ప్రస్థానం

Fri,September 20, 2019 10:42 PM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతిమాధవ్ దర్శకుడు. కె.ఎ.వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, క్యాథరిన్ టెస్రా, ఇజాబెల్లా లెయితే కథానాయికలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ముఖంపై రక్తపు గాయాలతో చేతిలో సిగరెట్ పట్టుకొని కోపోద్రిక్తుడై చూస్తున్న విజయ్ దేవరకొండ లుక్ ఉద్విగ్నంగా అనిపిస్తున్నది. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ పాత్ర చిత్రణ తీవ్ర భావోద్వేగాల కలబోతగా సాగుతుందని చెబుతున్నారు. అందరికి కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: సాహిసురేశ్, సమర్పణ: కె.ఎస్.రామారావు.

983

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles