విజయ్ దేవరకొండ బ్రేకప్


Wed,May 22, 2019 11:29 PM

vijay deverakona kranthi madhav movie is titled break up

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బ్రేకప్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో విఫల ప్రేమకుడిగా విజయ్ దేవరకొండ పాత్ర నవ్య పంథాలో సాగుతుందని సమాచారం. బ్రేకప్ బాధితుడిగా అతడు కనిపించనున్నట్లు చెబుతున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇసాబెల్లే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటున్నది. ఈ సినిమాతో పాటు డియర్‌కామ్రేడ్, హీరో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు విజయ్‌దేవరకొండ.

1746

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles