గీతగోవిందం హిందీలో

Thu,October 3, 2019 12:12 AM

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం బాలీవుడ్‌లో ‘కబీర్‌సింగ్‌' పేరుతో పునర్నిర్మితమై మూడువందల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ సినిమాల రీమేక్‌ హక్కులపై బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ‘గీతగోవిందం’ చిత్రాన్ని హిందీలో దర్శకుడు రోహిత్‌శెట్టి రీమేక్‌ చేయబోతున్నారు. కుటుంబ బంధాలు, వినోదం సమ్మిళితంగా రూపొందిన ఈ చిత్ర రీమేక్‌ హక్కుల్ని రోహిత్‌శెట్టి ఇటీవలే సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ రీమేక్‌కు అయన దర్శకత్వం వహిస్తారా? నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారా అన్నది ఇంకా వెల్లడికాలేదు. ఇందులో షాహిద్‌కపూర్‌ సోదరుడు ఇషాన్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘సూర్యవన్షీ’ చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

834

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles